Share News

Car loan Demand India: కార్‌ లోన్‌ ఇప్పుడే వద్దు

ABN , Publish Date - Sep 15 , 2025 | 05:15 AM

జీఎ్‌సటీ మండలి నిర్ణయాల ప్రభావం కార్‌ లోన్లపై పడింది. షోరూమ్‌లకు వచ్చి చూసిపోవడమే తప్ప, కొనుగోలుదారులెవరూ కార్లు కొనడం లేదు. ఫలితంగా బ్యాంకులు ఇచ్చే కార్‌లోన్లకు గిరాకీ తగ్గింది...

Car loan Demand India: కార్‌ లోన్‌ ఇప్పుడే వద్దు

కార్‌ లోన్‌ ఇప్పుడే వద్దు

జీఎ్‌సటీ తగ్గాక తీసుకుంటాం: కస్టమర్లు.. చూసి పోతున్నారంతే అంటున్న డీలర్లు

న్యూఢిల్లీ: జీఎ్‌సటీ మండలి నిర్ణయాల ప్రభావం కార్‌ లోన్లపై పడింది. షోరూమ్‌లకు వచ్చి చూసిపోవడమే తప్ప, కొనుగోలుదారులెవరూ కార్లు కొనడం లేదు. ఫలితంగా బ్యాంకులు ఇచ్చే కార్‌లోన్లకు గిరాకీ తగ్గింది. మంజూరైన కార్‌లోన్లను తీసుకునేందుకు కూడా ఖాతాదారులు ముందు కు రావడం లేదు. బ్యాంకులకు ఫోన్‌ చేసి, మా కార్‌ లోన్‌ అప్రూవల్‌ కాన్సిల్‌ చేయండి, తర్వాత చూద్దాం అని చెబుతున్నట్టు బ్యాంక్‌ అధికారులు చెబుతున్నారు. లోన్‌ కాన్సిలేషన్‌ ఛార్జీలు నామమాత్రంగా ఉండడం సైతం ఇందుకు కలిసొస్తోంది. మాన్సూన్‌ ఆఫర్‌ కింద ప్రాసెసింగ్‌ ఛార్జీలు రద్దు చేసినా, ఈ నెల 4 నుంచి కార్‌ లోన్లు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని బ్యాంకర్లు చెబుతున్నారు. కార్‌ డీలర్లు ఇన్‌వాయి్‌స జారీ చేస్తే పాత జీఎ్‌సటీ రేట్ల ప్రకారం 28 శాతం జీఎ్‌సటీ పడుతుంది. ఇన్‌వాయి్‌స లేకపోతే మాత్రం తగ్గించిన కొత్త జీఎ్‌సటీ 18 శాతం పడుతుంది. దీనికి తోడు ఈ నెల 7 నుంచి 21 వరకు పితృ తర్పణాలు విడిచే కాలం. దీన్ని చాలా మంది అశుభ కాలంగా పరిగణిస్తారు. కార్‌లోన్లకు గిరాకీ తగ్గడానికి ఇది కూడా ఒక కారణమని అధికారులు చెబుతున్నారు.


పెద్ద కారే కొందాం...

ఈ నెల 22 నుంచి కార్లు, ఎస్‌యూవీపై ప్రస్తుతం 28 శాతంగా ఉన్న జీఎ్‌సటీ 18 శాతానికి తగ్గనుంది. పెట్రోల్‌ కార్లయితే 1200 సీసీ, డిజిల్‌ కార్లయితే 1,500 సీసీ ఇంజిన్‌ సామర్ధ్యం వరకు 18 శాతం జీఎ్‌సటీ వర్తిస్తుంది. అంతకు మించితే మాత్రం 18 శాతం జీఎ్‌సటీతో పాటు ఒకటి నుంచి 22 శాతం వరకు ప్రత్యేక సెస్‌ వర్తిస్తుంది. దీంతో ఎంట్రీ లెవల్‌ కార్లు కొనాలనుకున్న వారు కూడా పునరాలోచనలో పడ్డారు. జీఎ్‌సటీ భారం తగ్గడంతో ధర కొద్దిగా ఎక్కువైనా ఎంట్రీ స్థాయిని మించి కొద్దిగా హైఎండ్‌ వెహికల్స్‌ కొనేందుకు ఆసక్తి చూపిస్తూ కొనుగోలు నిర్ణయాల్ని వాయిదా వేస్తున్నారు. కార్‌లోన్లకు డిమాండ్‌ తగ్గడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అయితే ఈ నెల 22 నుంచి మాత్రం కార్‌లోన్లకు డిమాండ్‌ భారీగా ఉంటుందని బ్యాంకింగ్‌ వర్గాల అంచనా. ఫెస్టివల్‌ సీజన్‌ కూడా కావడంతో మరింత ఆకర్షణీయమైన ఆఫర్లను కస్టమర్లను ఆకర్షించేందుకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి..

అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు

నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 15 , 2025 | 05:15 AM