BSNLహోమ్ వైఫై ప్లాన్.. రూ.399కే 60 Mbps స్పీడ్, నెలకు 3300 GB డేటా.. నెల ఫ్రీ.. ప్రతీ నెలా వంద తగ్గింపు
ABN , Publish Date - Dec 15 , 2025 | 06:24 PM
BSNL రూ. 399కే హోమ్ బ్రాడ్‌బాండ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఒక నెల ఫ్రీ.. ప్రతీనెలా రీచార్జి మీద వంద రూపాయలు చొప్పున మూడు నెలలపాటు డిస్కౌంట్. ఈ ప్లాన్ ద్వారా 60 Mbps వరకు ఇంటర్నెట్ స్పీడ్ నెలకు 3300 జీబీ డేటా..
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 15: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)హోమ్ బ్రాడ్ బాండ్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ఫైబర్ బేసిక్ ప్లాన్‌ను కేవలం రూ.399కే తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా 60 Mbps వరకు ఇంటర్నెట్ స్పీడ్ పొందొచ్చు. దీనితో పాటు నెలకు 3300 జీబీ డేటా వస్తుంది.
ఈ ప్లాన్‌ను ఎంచుకునే కస్టమర్లకు మొదటి నెల సర్వీస్ ఫ్రీగా లభిస్తుందని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. దీనితో పాటు మరో 3 నెలల పాటు రీఛార్జీలపై రూ.100 డిస్కౌంట్ ప్రకటించారు. 1800-4444 నంబర్‌కు వాట్సప్ ద్వారా 'Hi' అని మెసేజ్ చేయడం ద్వారా బుక్ చేసుకోవచ్చు. మరోవైపు, కేవలం రూ.61కే BSNL IFTV ప్రీమియమ్ ప్యాక్ ప్రవేశపెట్టింది.
BSNL IFTV విశేషాలు :
BSNL IFTV అంటే ఫైబర్ ఆప్టిక్ ద్వారా ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ అందించే సర్వీస్. దీని ద్వారా బీఎస్ఎన్ఎల్ యూజర్ లైవ్ టీవీ ఛానెల్స్ చూడవచ్చు. సెట్-టాప్ బాక్స్ లేకుండానే అంతరాయం లేని, హై క్వాలిటీ స్ట్రీమింగ్‌ను ఆస్వాదించవచ్చు. కేవలం రూ.61 రీఛార్జ్‌తో 1000కి పైగా ఛానెల్స్ చూడొచ్చు. స్టాటర్ ప్లే ప్లాన్ పేరుతో రూ.61 రీఛార్జ్ ప్లాన్, రూ.151తో లైట్ ప్లే హెచ్‌డీ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
బీఎస్ఎన్ఎల్ యూజర్లు IFTV సర్వీసెస్ యాక్టివేట్ చేసుకోవాలంటే 1800 444 నంబర్‌కు వాట్సప్ ద్వారా మెసేజ్ చేయాలి. లేదా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. https://fms.bsnl.in/iptvreg
Disclaimer: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనిని పెట్టుబడి లేదా వ్యాపార సలహా కాదని పాఠకులు గమనించాలి. మీరు చేసే వ్యాపారాలు లేదా పెట్టుబడుల వల్ల కలిగే లాభనష్టాలకు, సమాచారానికి ఆంధ్రజ్యోతి ఎలాంటి బాధ్యత వహించదు. మీ వ్యాపార, పెట్టుబడి లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు, మీ సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదిస్తే మంచిది.
ఇవీ చదవండి:
అంటార్కిటికాలో జాబ్.. రూ.1.3 కోట్ల జీతం.. వెళ్లాలా? వద్దా? యువకుడి డైలమా!
జాబ్ పోగొట్టుకున్న యువతి.. పనివేళల కంటే ముందే ఉద్యోగానికి వెళ్లి..