Share News

BFSI Jobs: బిఎఫ్‌ఎస్‌ఐ లో కొలువుల జోరు

ABN , Publish Date - Aug 22 , 2025 | 05:15 AM

ప్రస్తుతం ఐటీ రంగం అంత ఆకర్షణీయంగా లేకపోయినా బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా (బీఎ్‌ఫఎ్‌సఐ) కంపెనీల్లో మాత్రం నియామకాలు జోరందుకున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం

BFSI Jobs: బిఎఫ్‌ఎస్‌ఐ లో కొలువుల జోరు

2030 నాటికి అదనంగా 2.5 లక్షల ఉద్యోగాలు

ముంబై: ప్రస్తుతం ఐటీ రంగం అంత ఆకర్షణీయంగా లేకపోయినా బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా (బీఎ్‌ఫఎ్‌సఐ) కంపెనీల్లో మాత్రం నియామకాలు జోరందుకున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఈ కంపెనీల నియామకాలు 27 శాతం పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీల్లో నియామకాలు 8.7 శాతం పెరగనున్నాయని నియామకాల సేవలందించే అడెకో ఇండియా గురువారం విడుదల చేసిన ఒక నివేదికలో ఈ విషయం వెల్లడించింది. 2030 నాటికి ఈ కంపెనీల్లో నియామకాలు 10 శాతం చొప్పున పెరిగి కొత్తగా 2.5 లక్షల మందికి పర్మినెంట్‌ ఉద్యోగాలు కల్పిస్తాయని పేర్కొంది.

నివేదిక ముఖ్యాంశాలు

  • మెట్రో నగరాలతో పోలిస్తే ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనే ఎక్కువ కొలువులు

  • డిజిటల్‌, కంప్లయెన్స్‌ విధుల్లో అధికంగా ఉద్యోగాలు

  • స్థానిక భాషల్లో ప్రావీణ్యత, క్షేత్రస్థాయి అమ్మకాల్లో అనుభవం ఉన్న వారికి 15 శాతం వరకు అదనపు జీతాలు

  • సంప్రదాయ ఆస్తుల నుంచి మార్కెట్‌ ఆధారిత యూలిప్స్‌, మ్యూచు వల్‌ ఫండ్స్‌, పెన్షన్‌ ఫండ్ల వైపు మళ్లుతున్న మదుపరులు

  • రిలేషన్‌షి్‌ప ఎగ్జిక్యూటివ్‌లు, డిజిటల్‌ ప్రొడక్ట్‌ మేనేజర్లు, క్రెడిట్‌ రిస్క్‌ అనలిస్టులకు పెరుగుతున్న గిరాకీ

  • ఫైనాన్షియల్‌ ప్లాన్లు, ఇన్వె్‌స్టమెంట్‌ అడ్వైజర్లు, క్లెయిమ్స్‌ ఆటోమేషన్‌ స్పెషలిస్టుల కోసం చూస్తున్న వెల్త్‌, ఇన్సూరెన్స్‌ కంపెనీలు

  • నైపుణ్యాల అభివృద్దితో బీమా కంపెనీల్లో 30 శాతం పెరిగిన క్లెయిమ్స్‌ సెటిల్‌మెంట్‌

ఇవి కూడా చదవండి

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 22 , 2025 | 05:15 AM