Bajaj Pulsar: కొత్త ఏడాదిలో నెక్ట్స్ జనరేషన్ బజాజ్ పల్సర్ క్లాసిక్..
ABN , Publish Date - Dec 25 , 2025 | 09:25 AM
2026లో నెక్ట్స్ జనరేషన్ బజాజ్ పల్సర్ క్లాసిక్ లాంచ్ చేయబోతున్నారు. కొత్త ప్లాట్‌ఫామ్, మోనోషాక్, మోడ్రన్ ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి. దీంతో పాటు కొత్త చాసిస్ డిజైన్, LED ఫీచర్లతో పల్సర్ 125, 150 లాంచ్‌కు సిద్ధమవుతోంది.
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 25: బజాజ్ పల్సర్ 2001లో మార్కెట్‌లోకి వచ్చింది. 2026లో పల్సర్ బ్రాండ్‌కు 25 ఏళ్లు పూర్తి కానుంది. ఈ సందర్భంగా నెక్స్ట్ జనరేషన్ బజాజ్ పల్సర్ క్లాసిక్ మోడళ్లను బజాజ్ సంస్థ లాంచ్ చేయబోతోంది.
పల్సర్ క్లాసిక్ రేంజ్‌లో, గత రెండు దశాబ్దాల్లోనే అతి పెద్ద మార్పులు చోటుచేసుకోబోతున్నాయని సమాచారం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పల్సర్ 125, పల్సర్ 150 మోడళ్లు పాత డబుల్ క్రేడిల్ ఫ్రేమ్, ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్లతో ఉన్నాయి.
2026లో రానున్న కొత్త మోడళ్లు సరికొత్త చాసిస్‌పై రూపొందనున్నాయి. ప్లాట్‌ఫామ్‌లో మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది. ఇప్పటికే పల్సర్ N సిరీస్‌లో ఈ సెటప్ మంచి రైడ్, హ్యాండ్లింగ్ బ్యాలెన్స్ ఆకట్టుకుంటుందని అంటున్నారు. అదే అనుభవాన్ని ఇప్పుడు క్లాసిక్ పల్సర్‌లకు తీసుకురావాలని బజాజ్ యోచిస్తోంది.
అదనంగా LED హెడ్‌ల్యాంప్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి మోడ్రన్ ఫీచర్లు తీసుకొచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ జనరేషన్ పల్సర్ క్లాసిక్ బైక్స్ 2026 ఆగస్టులో లాంచ్ కావచ్చని అంచనా.
ఇక, కొత్త పల్సర్ 125 ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.80,000 నుంచి రూ.90,000 మధ్య ఉండొచ్చుని భావిస్తున్నారు. పల్సర్ 150 ఎక్స్-షోరూమ్ ధర రూ.1.05 లక్షల నుంచి రూ.1.15 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
2 రోజుల్లోనే అలర్జీ వచ్చింది.. ఢిల్లీ వాయి కాలుష్యంపై నితిన్ గడ్కరి కీలక వ్యాఖ్యలు
నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం-6
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి