Share News

Indian Pharmal: అరబిందో ఫార్మా చేతికి చెక్‌ కంపెనీ

ABN , Publish Date - Aug 21 , 2025 | 02:49 AM

అరబిందో ఫార్మా భారీ టేకోవర్‌కు సిద్ధమవుతోంది. చెక్‌ రిపబ్లిక్‌లోని జెంటివా ఫార్మా కంపెనీని కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోంది. ప్రైవేట్‌ ఈక్విటీ కంపెనీ అడ్వెన్‌ ఇంటర్నేషనల్‌కు జెంటివాలో...

Indian Pharmal: అరబిందో ఫార్మా చేతికి చెక్‌ కంపెనీ

550 కోట్ల డాలర్లకు కొనుగోలు ఆఫర్‌

న్యూఢిల్లీ: అరబిందో ఫార్మా భారీ టేకోవర్‌కు సిద్ధమవుతోంది. చెక్‌ రిపబ్లిక్‌లోని జెంటివా ఫార్మా కంపెనీని కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోంది. ప్రైవేట్‌ ఈక్విటీ కంపెనీ అడ్వెన్‌ ఇంటర్నేషనల్‌కు జెంటివాలో ఉన్న మెజారిటీ వాటాను 500 కోట్ల డాలర్ల నుంచి 550 కోట్ల డాలర్లతో (సుమారు రూ.43,500 కోట్ల నుంచి రూ.47,850 కోట్లు) కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ వార్తలు నిజమైతే ఒక భారత ఫార్మా కంపెనీ ఒక విదేశీ ఫార్మా కంపెనీని, ఇంత పెద్ద మొత్తంతో కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి అవుతుంది. అయితే అరబిందో ఫార్మా ఈ వార్తలను తోసిపుచ్చింది. చెక్‌ కంపెనీ కొనుగోలు కోసం చర్చలు జరుగుతున్నాయి తప్ప, ఇంకా తుది ఒప్పందమైతే కుదరలేదని స్పష్టం చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి..

యాత్రికులకు అలర్ట్.. ఆగిన పాపికొండల విహారయాత్ర..

సీఎంపై దాడి.. హైటెన్షన్!

యూరియాపై ఫలించిన ఎంపీల పోరాటం

For National News And Telugu News

Updated Date - Aug 21 , 2025 | 02:49 AM