ASBL Loft Project: వచ్చే ఏడాది డిసెంబరు నాటికి లాఫ్ట్ ప్రాజెక్ట్ పూర్తి
ABN , Publish Date - Sep 20 , 2025 | 03:55 AM
రియల్టీ సంస్థ ఏఎ్‌సబీఎల్.. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మిస్తున్న లాఫ్ట్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది డిసెంబరు నాటికల్లా పూర్తి కానుంది. ఐదెకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): రియల్టీ సంస్థ ఏఎ్‌సబీఎల్.. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మిస్తున్న లాఫ్ట్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది డిసెంబరు నాటికల్లా పూర్తి కానుంది. ఐదెకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ లగ్జరీ నివాస గృహాల ప్రాజెక్ట్ తమకు అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అని ఏఎ్‌సబీఎల్ వ్యవస్థాపకుడు సీఈఓ కే అజితేష్ చెప్పారు. ఈ ప్రాజెక్టులో జీ+45 ఫ్లోర్లతో ఒక్కోటి 1,700 ఎస్‌ఎ్‌ఫటీ నుంచి 1,900 ఎస్‌ఎ్‌ఫటీ విస్తీర్ణంలో 894 ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లను నిర్మిస్తోంది. రూ.500 కోట్ల పెట్టుబడితో చేపట్టిన ఈ ప్రాజెక్టులో చదరపు అడుగు ధరను కంపెనీ రూ.11,000గా నిర్ణయించినట్టు అజితేష్ చెప్పారు. రవాణాపరంగా నగరంలోని అన్ని ప్రాంతాలతో అనుసంధానమైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఈ ప్రాజెక్టుపై కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు.
ఇవి కూడా చదవండి..
డీయూఎస్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయభేరి
హఫీజ్‌ను కలిసినందుకు మన్మోహన్ కృతజ్ఞతలు.. అఫిడవిట్‌లో యాసిన్ మాలిక్ వెల్లడి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి