Apple iPhone 17 Launch: ఐ ఫోన్ 17 కోసం బారులు
ABN , Publish Date - Sep 20 , 2025 | 03:57 AM
యాపిల్ కంపెనీ శుక్రవారం భారత మార్కెట్లో విడుదల చేసిన ఐఫోన్ 17 కోసం కస్టమర్లు దేశంలోని మూడు ప్రధాన స్టోర్ల ముందు బారులు తీరారు. కొత్త డివై్‌సను కళ్లారా చూసి, చేజిక్కించుకోవాలన్న...
న్యూఢిల్లీ: యాపిల్ కంపెనీ శుక్రవారం భారత మార్కెట్లో విడుదల చేసిన ఐఫోన్ 17 కోసం కస్టమర్లు దేశంలోని మూడు ప్రధాన స్టోర్ల ముందు బారులు తీరారు. కొత్త డివై్‌సను కళ్లారా చూసి, చేజిక్కించుకోవాలన్న ఆతృతతో గురువారం అర్ధరాత్రి నుంచే కస్టమర్లు ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లోని యాపిల్ స్టోర్ల ముందు క్యూ కట్టారు. ప్రధానంగా యువత అత్యుత్సాహంతో సుమారు 21 గంటలకు పైగా ఐఫోన్ 17 పొందడం కోసం అలాగే క్యూలైన్లలోనే పడిగాపులు పడుతూ కనిపించారు. ఢిల్లీలోని సాకేత్ సిటీ వాక్ మాల్, బెంగళూరులోని హెబ్బాల్‌లో ఆసియా మాల్, ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్ ముందు ఏర్పడిన పొడవైన క్యూలు ఆ బ్రాండ్‌కు గల జనాదరణకు దర్పణం పట్టాయి. స్టోర్లన్నీ ముందుగానే ప్రకటించినట్టుగా ఉదయం 8 గంటలకు తెరిచారు. తాము ముందస్తుగా బుక్ చేసుకుని, చేతుల్లోకి తీసుకున్న ఐఫోన్ 17ను చూపుతూ కస్టమర్లు వెలుపలికి వస్తున్న దృశ్యాలు కనిపించాయి. అమ్మకాలు ప్రారంభమైన తొలిరోజు రికార్డు స్థాయిలో కస్టమర్ల రాక కనిపించిందని రిటైలర్లు ప్రకటించారు. కాగా ముంబైలో ఉదయం ఆరు గంటల ప్రాంతంలో లైన్లో ఉన్న కొందరు కస్టమర్ల మధ్య చిన్న పాటి గొడవ జరిగింది. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది రంగంలోకి దిగడంతో గొడవ సద్దుమణిగింది. యాపిల్ ఐఫోన్ 17 మన దేశంలో రూ.82,900 నుంచి రూ.2,29,000 ధరల శ్రేణిలో అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి..
డీయూఎస్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయభేరి
హఫీజ్‌ను కలిసినందుకు మన్మోహన్ కృతజ్ఞతలు.. అఫిడవిట్‌లో యాసిన్ మాలిక్ వెల్లడి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి