డిఫెన్స్ షేర్లపై కన్నేయండి
ABN , Publish Date - May 12 , 2025 | 05:27 AM
భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ వారం స్టాక్ మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్వెస్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండ టం మంచిది. నాణ్యమైన షేర్లు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తే...
భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ వారం స్టాక్ మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్వెస్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండ టం మంచిది. నాణ్యమైన షేర్లు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తే కొనుగోలు చేయొచ్చు. ఈ వారం రక్షణ (డిఫెన్స్) రంగానికి చెందిన షేర్లకు భారీగా గిరాకీ పెరగొచ్చు. కొరియర్, షిప్ బిల్డింగ్, టెక్స్‌టైల్ రంగాలు కూడా బుల్లి్‌షగా కనిపిస్తున్నాయి. టెలికాం ఇన్‌ఫ్రా, రైల్వే వ్యాగన్స్, పేపర్, హాస్పిటాలిటీ రంగ షేర్లు బేరి్‌షగా ఉన్నాయి.
స్టాక్ రికమండేషన్స్
అపోలో మైక్రోసిస్టమ్స్: మూడు నెలలుగా దిద్దుబాటుకు లోనవుతున్న ఈ షేరులో ప్రస్తుతం మూమెంటమ్, రిలేటివ్ స్ట్రెంత్ పెరిగింది. కీలకమైన రూ.110 స్థాయిలో మరోసారి మద్దతు లభించింది. గత శుక్రవారం ఈ షేరు 11.8 శాతం లాభంతో రూ.130 వద్ద క్లోజైంది. మదుపరులు ఈ కౌంటర్‌లో రూ.125 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.155 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.119 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
డాటా ప్యాటర్న్స్: కొన్ని నెలలుగా డౌన్‌ట్రెండ్‌లో పయనించిన ఈ షేరు మార్చి ఆరంభం నుంచి పుంజుకుంది. పైగా మూమెంటమ్, డెలివరీ గణనీయంగా పెరుగుతున్నాయి. గత శుక్రవారం 4.2 శాతం లాభంతో రూ.2,295 ముగిసిన ఈ కౌంటర్‌లోకి మదుపరులు రూ.2,250 వద్ద ఎంటరై రూ.2,550/2,900 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.2,200 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ఆస్ట్రా మైక్రో: గత ఏడాది జూలైలో జీవితకాల గరిష్ఠాన్ని తాకిన తర్వాత ఈ షేరు దిద్దుబాటుకు లోనైంది. మళ్లీ మార్చి ఆరంభం నుంచి పుంజుకుంటోంది. చివరి నెల రోజుల్లో ఏకంగా 28 శాతం మేర లాభపడింది. మూమెంటమ్, రిలేటివ్ స్ట్రెంత్‌కు తిరుగులేదు. గత శుక్రవారం ఈ షేరు 6 శాతం లాభంతో రూ.882 వద్ద క్లోజైంది. మదుపరులు ఈ కౌంటర్‌లో రూ.850 వద్ద పొజిషన్ తీసుకుని రూ.1,050 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.825 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్): గత ఏడాది జూలైలో ఈ షేరు రూ.1,794 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకిన తర్వాత ఈ ఏడాది మార్చి వరకు పతన బాటలోనే సాగింది. రూ.1,000 స్థాయిలో డబుల్ బాటమ్ ఫామ్ అయిన తర్వాత బలంగా పుంజుకుంది. చివరి మూడు నెలల్లో ఏకంగా 28 శాతంమేర పెరిగింది. గత శుక్రవారం 5.79 శాతం లాభంతో రూ.1,538 వద్ద క్లోజైంది. మదుపరులు ఈ కౌంటర్‌లో రూ.1,500 శ్రేణిలో ప్రవేశించి రూ.1,850 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,430 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
పారస్ డిఫెన్స్: సుదీర్ఘకాలంగా కన్సాలిడేట్ అవుతున్న ఈ కౌంటర్‌లో ఫిబ్రవరి నుంచి ఒక్కసారిగా మూమెంటమ్, రిలేటివ్ స్ట్రెంత్ పెరిగాయి. జీవితకాల గరిష్ఠం రూ.1,600 స్థాయిని అందుకునేందుకు సిద్ధమవుతోంది. గత శుక్రవారం 7.3 శాతం లాభంతో రూ.1,458 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లోకి మదుపరులు రూ.1,400 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.1,650 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,340 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
ఇవి కూడా చదవండి..
పాక్ లో ప్రస్తుత పరిస్థితి .. చైనా శాటిలైట్ చిత్రాలు
Buddha Venkanna: విషపురుగు.. అందుకే దూరం పెట్టిన చంద్రబాబు
Operation Sindoor: మరికొద్ది గంటల్లో హాట్ లైన్ చర్చలు.. రంగం సిద్ధం..
Operation Sindoor: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
India Vs Pakistan: ప్రధాని మోదీకి రాహుల్ కీలక సూచన
Operation Sindoor: భారత సైన్యం రావల్పిండిలోనూ గర్జించింది: రాజ్‌నాథ్ సింగ్
For Andhrapradesh news and Telugu News