Amazon Great Indian Festival: 23 నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్
ABN , Publish Date - Sep 11 , 2025 | 05:20 AM
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, 2025 ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతోంది. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్రైబర్లు ఒక రోజు ముందే ఇందులో పాల్గొనవచ్చు. ఈ ఫెస్టివల్‌లో 17 లక్షల మందికి పైగా...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, 2025 ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతోంది. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్రైబర్లు ఒక రోజు ముందే ఇందులో పాల్గొనవచ్చు. ఈ ఫెస్టివల్‌లో 17 లక్షల మందికి పైగా అమ్మకందారులు తమ ఉత్పత్తులను అమ్మకానికి పెడుతున్నారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అమ్మకందారులే 80,000 వరకు ఉంటారని అమెజాన్ ఇండియా డైరెక్టర్ (షాపింగ్ ఎక్స్‌పీరియన్స్) తోట కిషోర్ చెప్పారు. రెండు రాష్ట్రాల్లోని 700కుపైగా డెలివరీ కేంద్రాల ద్వారా ఈ సారి తమ కస్టమర్లకు సరుకులు అందించనున్నట్టు తెలిపారు. జీఎ్‌సటీ రేట్ల సవరణతో ఈ ఏడాది ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, 2025’ అమ్మకాలు భారీగా పుంజుకుంటాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ ఫెస్టివల్ అమ్మకాల రద్దీకీ అనుగుణంగా సరుకులను కొనుగోలుదారులకు అందించేందుకు లక్షన్నర మంది సీజనల్ ఉద్యోగులను అమెజాన్ ఇండియా నియమించింది. తెలంగాణ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో కొనుగోలు దారులు ఎక్కువగా మిడ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు, టీవీల వంటి కన్జుమర్ ఎలకా్ట్రనిక్ పరికరాలపై ఆసక్తి చూపిస్తున్నట్టు అమెజాన్ ఇండియా డైరెక్టర్ (కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్) జెబా ఖాన్ చెప్పారు.
ఇవి కూడా చదవండి
భారత్‌లో తొలి టెస్లా కారు డెలివరీ.. కస్టమర్ ఎవరంటే..
34 వాహనాల్లో మానవబాంబులు.. బెదిరింపు మెయిల్స్‌తో హైఅలర్ట్
For More National News and Telugu News