Insurance Awareness IndiaL అవగాహనా లోపమే బీమాకు సమస్య
ABN , Publish Date - Aug 22 , 2025 | 04:52 AM
దేశంలో జీవిత బీమా విస్తరణకు ప్రజల అవగాహనా లోపం పెద్ద సమస్యగా మారిందని ఇన్సూరెన్స్ అవేర్‌నెస్ కమిటీ (ఐఏసీ-లైఫ్) కో చైర్‌పర్సన్ వెంకటాచలం అన్నారు. ఇప్పటికీ మన జనాభాలో...
ఐఏసీ-లైఫ్ కో చైర్‌పర్సన్ వెంకటాచలం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): దేశంలో జీవిత బీమా విస్తరణకు ప్రజల అవగాహనా లోపం పెద్ద సమస్యగా మారిందని ఇన్సూరెన్స్ అవేర్‌నెస్ కమిటీ (ఐఏసీ-లైఫ్) కో చైర్‌పర్సన్ వెంకటాచలం అన్నారు. ఇప్పటికీ మన జనాభాలో 83 శాతం మందికి సరైన బీమా రక్షణ లేని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే బీమా కంపెనీలకు 17 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.1,483.25 లక్షల కోట్లు) విలువైన అదనపు వ్యాపార అవకాశం ఏర్పడుతుందన్నారు. ప్రస్తుతం జీవిత బీమా తీసుకుంటున్న వారిలోనూ ఎక్కువ మంది సేవింగ్స్, చైల్డ్ పాలసీలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారే తప్ప, రిటైర్మెంట్ పాలసీలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదన్నారు. తెలంగాణలో మాత్రం ఇప్పుడిప్పుడే రిటైర్మెంట్ పాలసీలపై ఆసక్తి పెరుగుతోందన్నారు.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి