YS Sharmila: దమ్ముంటే అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేయండి.. జగన్‌కు షర్మిల సవాల్
ABN , Publish Date - May 22 , 2025 | 05:14 PM
లిక్కర్ మాఫియా థ్రిల్లర్ సిరీస్‌తో వైసీపీకి భయం పట్టుకుందన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. దమ్ముంటే ఈ విషయంపై అసెంబ్లీ సాక్షిగా విచారణ కోరాలని మాజీ సీఎం జగన్‌కు షర్మిలా సవాల్ చేశారు.

విజయవాడ: మద్యం కుంభకోణం వ్యవహారంలో మాజీ సీఎం జగన్‌పై వైఎస్ షర్మిలా రెడ్డి సెటైర్లు వేశారు. లిక్కర్ మాఫియా థ్రిల్లర్ సిరీస్‌తో వైసీపీకి భయం పట్టుకుందన్నారు. జగన్ ఒక మాజీ ముఖ్యమంత్రి అని.. అయితే, ఆయన ఆ హోదా మరిచి మాట్లాడుతున్నారని షర్మిలా విమర్శించారు.
మరిచిపోలేదు
గతంలో జగన్ పోలీసులను బట్టలు ఊడదీస్తా అన్నారని అయితే, అలా మాట్లాడటం ఏ మాత్రం బాగోలేదని షర్మిల కామెంట్స్ చేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసన్నారు. ఆ విషయంపై ఇప్పటి డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణం రాజు, కాదంబరి జిత్వానీ కూడా మరిచి పోలేదని పేర్కొన్నారు.
డిమాండ్ చేయండి..
'లిక్కర్ అవినీతిలో మీ తప్పు లేకుంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి.. లిక్కర్ స్కాంలో అవినీతి లేదు అనుకుంటే అసెంబ్లీ సాక్షిగా విచారణ వేయమని డిమాండ్ చేయండి.. ACB లేదా CBIతో విచారణ కోరండి' అంటూ జగన్‌కు షర్మిలా సూచించారు. మీ హయంలో డిజిటల్ పేమెంట్ ఎందుకు చేయలేదో చెప్పాలని, అలాగే దమ్ముంటే విచారణ కోరాలని సవాల్ చేశారు.
Also Read:
రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
బైకును లగేజీ ట్రాలీగా మార్చాడుగా.. ఇతడి తెలివి చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
For More Telugu And National News