Elamanchili Tension: యలమంచిలిలో ఉద్రిక్తత.. ఓ వ్యక్తిని దొంగగా ఆరోపిస్తూ పాంప్లెట్స్ పంపిణీ..
ABN , Publish Date - Dec 17 , 2025 | 06:51 PM
పశ్చిమ గోదావరి జిల్లాలోని యలమంచిలిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని దొంగ అని ఆరోపిస్తూ.. ఆయన ఇంటివద్ద ఆందోళనకు దిగారు.
పశ్చిమ గోదావరి జిల్లా, డిసెంబర్ 17: యలమంచిలి(Yelamanchili) మండలంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుంపర్రు(Gumparru)లోని కడిమిపుంతలో తుంగ నాగేశ్వర రావు(Tunga Nageswara Rao) అనే వ్యక్తిని దొంగగా ఆరోపిస్తూ.. ఆయన ఇంటిపై కోడిగుడ్లతో దాడి చేశారు స్థానికులు. అంతేకాకుండా.. మైక్ సెట్‌తో పాటలు పాడుతూ నాగేశ్వర రావు ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు అక్కడి యువకులు, మహిళలు.
ఈ నేపథ్యంలో నాగేశ్వర రావు కోడలైన ఆ గ్రామ సర్పంచ్ అమూల్య(Sarpanch Amulya)తో వాగ్వాదానికి దిగారు గ్రామస్థులు. రియల్ ఎస్టేట్ పేరుతో తమను నాగేశ్వర రావు మోసం చేశాడని ఆందోళన చేస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు.
ఇవీ చదవండి: