Share News

Stella ship: ఎట్టకేలకు పయనమైన స్టెల్లా నౌక

ABN , Publish Date - Jan 06 , 2025 | 09:27 AM

Andhrapradesh: ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున పశ్చిమ ఆఫ్రికాకు స్టెల్లా నౌక బయలుదేరి వెళ్లిపోయింది. దాదాపు 55 రోజులుగా కాకినాడ పోర్టులో 'స్టెల్లా ఎల్' నౌక నిలిచిపోయిన విషయం తెలిసిందే. నౌక పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్ దేశంలో కొటోనౌ పోర్టుకు బయల్దేరేందుకు కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ అనుమతిచ్చారు.

Stella ship: ఎట్టకేలకు పయనమైన స్టెల్లా నౌక
Stella Ship

కాకినాడ, జనవరి 6: కాకినాడలో (Kakinada) నిలిచిపోయిన స్టెల్లా నౌకకు (Stella Ship) ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున పశ్చిమ ఆఫ్రికాకు నౌక బయలుదేరి వెళ్లిపోయింది. దాదాపు 55 రోజులుగా కాకినాడ పోర్టులో 'స్టెల్లా ఎల్' నౌక నిలిచిపోయిన విషయం తెలిసిందే. నౌక పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్ దేశంలో కొటోనౌ పోర్టుకు బయల్దేరేందుకు కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ అనుమతిచ్చారు. గతేడాది నవంబరు 11న స్టెల్లా నౌక బియ్యం లోడింగ్ కోసం కాకినాడ తీరానికి వచ్చింది. అయితే నౌకలోకి 32,415 టన్నులు లోడవగా అందులో రేషన్ బియ్యం ఉన్నట్లు నవంబరు 27న గుర్తించారు. రేషన్ బియ్యం దించేసి మిగిలిన సాధరణ బియ్యం లోడింగ్ చేసుకుని స్టెల్లా నౌక వెళ్లిపోయింది. గత ఏడాది నవంబర్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించగా.. స్టెల్లా నౌకలో రేషన్ బియ్యం ఉండటాన్ని గుర్తించారు. ఈ వార్త అప్పట్లో పను సెంచలనంగా మారింది. వెంటనే స్టెల్లా నౌకను సీజ్ చేయాల్సిందిగా అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.


అలాగే అక్రమంగా రేషన్‌ బియ్యం లోడింగ్ చేయడంపై విచారణకు ఆదేశించారు కూడా. దీంతో నౌకలో రేషన్‌ బియ్యం ఎంత ఉందనే దానిపై అధికారులు ఆరా తీశారు. దాదాపు నెల రోజులుగా నౌకలో లోడింగ్ అయిన రేషన్ బియ్యం ఎంత అనే దానిపై సమాచారం సేకరించారు. దాదాపు 1320 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యం ఉన్నట్లు గత ఏడాది డిసెంబర్ 17 జిల్లా కలెక్టర్ తేల్చారు. అనంతరం బియ్యాన్ని స్టెల్లా నౌక నుంచి గోదాములకు తరలించారు. అనంతరం స్టెల్లా నౌక పయనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే మొదటి నుంచి స్టెల్లా నౌకకు అన్ని అవాంతరాలే ఎదురయ్యాయి. స్టెల్లా నౌకలోని రేషన్ బియ్యాన్ని ఒడ్డుకు చేర్చేందుకు వాతావరణం అనుకూలించలేదు. గత ఏడాది డిసెంబర్‌లో తుఫాను ప్రభావంతో బలమైన ఈదురు గాలులు వీచాయి.


అలాగే సముద్రంలో అలల ఉధృతి పెరిగింది. దీంతో స్టెల్లా నౌక నుంచి బియ్యాన్ని ఒడ్డుకు తరలించడం అసాధ్యంగా మారింది. చివరకు తుఫాను ప్రభావం సర్దుమణిగిన తర్వాత నౌక నుంచి రేషన్ బియ్యాన్ని అన్‌లోడ్ చేశారు అధికారులు. అనంతరం 12వేల మెట్రిక్ టన్నుల సాధారణ బియ్యాన్ని లోగింగ్ చేశారు. అనంతరం స్టెల్‌ నౌక పయనానికి కాకినాడ జిల్లా కలెక్టర్ పచ్చ జెండా ఊపడంతో ఈరోజు తెల్లవారుజామున పశ్చిమ ఆఫ్రికాకు నౌక పయనమైంది. కాకినాడ పోర్టు నుంచి పశ్చిమ ఆఫ్రికాకు స్టెల్లా నౌక చేరేందుకు దాదాపు 26 రోజుల సమయంల పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి 55 రోజుల పాటు కాకినాడ పోర్టులోనే లంగర్ వేసుకుని ఉన్న స్టెల్లా ఎల్ పనామా నౌక పశ్చిమ ఆఫ్రికాకు బయలుదేరి వెళ్లిపోయింది.


ఇవి కూడా చదవండి...

Nara Lokesh: ప.గో. జిల్లా: పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న మంత్రి లోకేష్

Loyola College Walkers: మరోసారి లయోలా వాకర్స్‌కు చేదు అనుభవం.. ఎందుకంటే

Read Latest AP News And Telugu news

Updated Date - Jan 06 , 2025 | 09:43 AM