Share News

Water Leakage Reported at Sri Sailam Dam: శ్రీశైలం డ్యాం క్రస్టు గేట్ల నుంచి నీరు లీకేజీ

ABN , Publish Date - Sep 04 , 2025 | 02:57 AM

శ్రీశైలం జలాశయం 3, 10 రేడియల్‌ క్రస్టు గేట్ల నుంచి నీరు లీక్‌ అవుతోంది. జలాశయానికి వరద ప్రవాహం...

Water Leakage Reported at Sri Sailam Dam: శ్రీశైలం డ్యాం క్రస్టు గేట్ల నుంచి నీరు లీకేజీ

శ్రీశైలం, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయం 3, 10 రేడియల్‌ క్రస్టు గేట్ల నుంచి నీరు లీక్‌ అవుతోంది. జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో అధికారులు మంగళవారం రాత్రి గేట్లు మూసివేశారు. అయితే గేట్లకు అమర్చిన రబ్బర్‌ సీల్స్‌ దెబ్బతినడంతో నీరు లీక్‌ అవుతోంది. ఈ విషయంపై జలవనరుల శాఖ సీఈ కబీర్‌ బాషా మాట్లాడుతూ ప్రస్తుతం లీకేజీ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఈ ఏడాది జలాశయానికి ముందస్తుగా వరద రావడంతో పనులకు ఆటంకం ఏర్పడిందని, త్వరలోనే రబ్బర్‌ సీల్స్‌ను మార్చడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

డ్యామ్‌ను పరిశీలించిన కేఆర్‌ఎంబీ ఇన్‌చార్జి చైర్మన్‌

శ్రీశైలం జలాశయాన్ని కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఇన్‌చార్జి చైర్మన్‌ బీపీ పాండే, జలవనరుల శాఖ సీఈ కబీర్‌ బాషా, బోర్డు మెంబర్‌ కేకే జంగిడ్‌, డీఈఈ పవన్‌నాథ్‌, డీఎండీ ఈఈ వేణుగోపాల్‌రెడ్డితో కలిసి బుధవారం పరిశీలించారు. జలాశయం గ్యాలరీ, గేట్స్‌, ప్లంజ్‌ పూల్‌, వరద నీటి చేరికలు, విద్యుదుత్పత్తి కేంద్రాలను పరిశీలించారు. వీటి గురించి ఈఈ వేణుగోపాల్‌రెడ్డి మ్యాప్‌ ద్వారా వివరించారు.


తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. నువ్వొస్తానంటే.. నే రానిస్తానా..!

పౌరుషానికి ప్రతీక నందమూరి హరికృష్ణ..

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 04 , 2025 | 02:57 AM