Share News

Vizianagaram Terror Case: పేలుళ్ల కుట్ర కేసు.. వెలుగులో సంచలన విషయాలు

ABN , Publish Date - May 20 , 2025 | 01:26 PM

Vizianagaram Terror Case: హైదరాబాద్‌లో ఉండగా బోయ గోడకు చెందిన సయ్యద్ సమీర్‌తో సిరాజ్‌కు పరిచయం ఏర్పడింది. సమీర్ ద్వారా వరంగల్‌కు చెందిన పరహాన్ మొయినుద్దీన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన బాదర్‌తో పరిచయాలు ఏర్పడ్డాయి.

Vizianagaram Terror Case: పేలుళ్ల కుట్ర కేసు.. వెలుగులో సంచలన విషయాలు
Vizianagaram Terror Case

విజయనగరం, మే 20: ఉగ్రకుట్ర కేసులో ఎన్‌ఐఏ అధికారులు (NIA Officers) దర్యాప్తును ముమ్మరం చేశారు. పేలుళ్ల కుట్ర కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటకలో పేలుళ్లకు నిందితులు కుట్ర పన్నినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఆరుగురు సభ్యులతో సమీర్.. ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. అల్- హింద్ ఇత్తేహదుల్ ముసల్మాన్ పేరుతో గ్రూపులు ఏర్పాటు చేసి ఇందులోనే వీరంతా చర్చించినట్లు తెలుస్తోంది. విజయనగరంకు చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. సిరాజ తండ్రి విజయనగరంలోని రూరల్ స్టేషన్‌లో ఏఎస్సై, తమ్ముడు ఎస్డీఎఫ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2017లో సిరాజ్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఎస్సై సెలక్షన్స్ కోసం హైదరాబాదులో శిక్షణ కోసం వచ్చాడు. రెండు సార్లు ఎస్సై కోసం ప్రయత్నం చేసి సిరాజ్ విఫలమయ్యాడు.


గ్రూప్ వన్ కోసం శిక్షణ తీసుకుని రెండుసార్లు ప్రయత్నం చేసినప్పటికీ సిరాజ్ సెలక్ట్ అవ్వలేదు. 2024 ఆగస్టు సెప్టెంబర్, అక్టోబర్ నెలలో 108లో టెలికాలర్‌గా పనిచేశాడు. హైదరాబాద్‌లో ఉండగా బోయ గోడకు చెందిన సయ్యద్ సమీర్‌తో పరిచయం ఏర్పడింది. సమీర్ ద్వారా వరంగల్‌కు చెందిన పరహాన్ మొయినుద్దీన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన బాదర్‌తో పరిచయాలు ఏర్పడ్డాయి. సామాజిక మాద్యమాల్లో ఓ వర్గానికి జరుగుతున్న అన్యాయాలపై చర్చించారు. గత ఏడాది నవంబర్ 22న సమీర్, సిరాజ్ ముంబైకి వెళ్లి ఓ పదిమందిని కలిశారని... అద్నాన్ కురేసి, దిల్షాన్, మొహిషిన్ షేక్, జహీర్ అలియాస్ అమన్ కలిసి ఓ లైవ్ షోకు హాజరైనట్లు తెలుస్తోంది. అలాగే షహబాజ్, జీషన్ తదితరులు కలిసేందుకు జనవరి 26న ఢిల్లీ వెళ్లిన సమీర్.. షహబాజ్ విదేశాలకు వెళ్లిపోయాడని తెలిసి మరుసటి రోజు మండూలికి వెళ్లి సల్మాన్‌ను కలిసినట్లు దర్యాప్తు సంస్థలు తేల్చాయి.

Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే


సౌదీలో ఉంటున్న అబూ ముసబ్ సూచనల మేరకు సిగ్నల్ యాప్‌లో తరచూ మాట్లాడుకునే వారని సమాచారం. రసాయన పదార్థాలు ఉపయోగించి ఐఈడీలు తయారు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆన్‌లైన్ ద్వారా పేలుడు పదార్థాలను తెప్పించాడు సిరాజ్. ఆన్‌లైన్‌లో బాంబులు ఎలా తయరు చేయాలనే దానిపై కొన్ని వీడియోలను చూసి వాటి ద్వారా కొన్ని బాంబులను తయారు చేసి కొన్ని చోట్ల ట్రయల్స్‌ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. విజయనగరం, రంపచోడవరం ప్రాంతాల్లో ఈ ట్రయల్స్ నిర్వహించినట్లు గుర్తించారు. సిరాజ్ ఈ ట్రయల్స్‌ నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది. జిహాదీ చర్యల్లో భాగంగా అవసరమైతే ప్రాణత్యాగం చేయాలని సిరాజ్, సమీర్‌లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు మొదలైన నేపథ్యంలో ఈ ఇద్దరిని కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తోంది. ఇద్దరినీ కస్టడీలోకి తీసుకుంటే ఉగ్రకుట్రలకు సంబంధించి కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి

AP Heavy Rains: అలర్ట్.. ఏపీలో ఉరుములు, మెరుపులతో వర్షాలు

NIA Investigation: ఉగ్ర కుట్రపై రెండో రోజు ఎన్‌ఐఏ దర్యాప్తు

Read Latest AP News And Telugu News

Updated Date - May 20 , 2025 | 02:09 PM