Visakha Tragic Road Accident: విశాఖలో షాకింగ్ ఘటన.. మహిళ స్కూటీపై వెళ్తుండగా
ABN , Publish Date - May 05 , 2025 | 04:27 PM
Visakha Tragic Road Accident: విశాఖకు చెందిన పూర్ణిమ అనే మహిళ తన స్కూటీపై వెళుతోంది. ఏఎంజీ ఆస్పత్రి సమీపానికి చేరుకుంది మహిళ. కానీ ఆ మార్గంలో ఆమెకు ప్రమాదం పొంచి ఉందని తెలీక ఎప్పటి లాగే స్కూటీపై వెళ్తోంది. ఇంతలోనే అక్కడే ఉన్న ఓ భారీ చెట్టు ఆమెపై పడిపోయింది.
విశాఖపట్నం, మే 5: మృత్యువు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటి వరకు సరదాగా గడుపుతున్న వారు అనుకోకుండా మృత్యు ఒడిలోకి వెళ్తుంటారు. ఈ మధ్యకాలంలో బయటకు వెళ్లిన మనిషి ఇంటికి వచ్చేదాకా కూడా టెన్షన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎలాంటి ప్రమాదాల బారిన పడతారో తెలియదు. మామూలుగా నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తుల పైకి వాహనాలు దూసుకురావడం, లేదా పిడుగులు పడటంతో, చెట్లు పడటంతో ప్రాణాలు కోల్పోతుంటారు. మృత్యువు ఏ రూపంలో వస్తుందో.. ఎలా వస్తుందో కూడా ఎవరూ ఊహించను కూడా ఊహించలేదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వార్త కూడా అలాంటిదే. రోడ్డు మీద వెళ్తున్న మహిళను ఎలా మృత్యువు కబలించిందో చూస్తే రోమాలు నిక్కపొడుచుకోవడం ఖాయం.
విశాఖపట్నంలో విషాదం చోటు చేసుకుంది. చెట్టుకూలి ఓ మహిళ మృతి చెందింది. విశాఖకు చెందిన పూర్ణిమ అనే మహిళ తన స్కూటీపై వెళుతోంది. ఏఎంజీ ఆస్పత్రి సమీపానికి చేరుకుంది మహిళ. కానీ ఆ మార్గంలో ఆమెకు ప్రమాదం పొంచి ఉందని తెలీక ఎప్పటి లాగే స్కూటీపై వెళ్తోంది. ఇంతలోనే అక్కడే ఉన్న ఓ భారీ చెట్టు ఆమెపై పడిపోయింది. పెద్ద వృక్షం పడటంతో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దృశ్యాలన్నీ కూడా అక్కడ ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. అసలు ఇలా జరుగుతుందని మహిళ కూడా ఊహించి ఉండదు. దీంతో స్కూటీ ప్రయాణమే ఆమెకు చివరి ప్రయాణంగా మిగిలిపోయింది.
Snake Control Tips: పాములు ఇళ్లల్లోకి వస్తున్నాయా.. అయితే ఇలా చేయండి
చెట్టు పడిన వెంటనే స్థానికులు అక్కడకు వచ్చి చెట్టును తొలగించే ప్రయత్నం చేశారు. మహిళకు ఏం కాకూదని చాలా తొందరగా చెట్టు కొమ్మలను తొలగించారు స్థానికులు. కానీ అప్పటికే తీవ్ర గాయాలపాలైన మహిళ ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మహిళ మృతి విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. దీంతో బయటకు వెళ్లిన ఆమె ఇలా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు కూడా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అంతేకాకుండా అదే ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న కారు పై కూడా చెట్టు కూలి పడింది. దీంతో కారు కూడా పూర్తిగా దెబ్బతింది. అయితే బలహీనంగా ఉన్న చెట్టుకొమ్మలు భారీ వాహనాలకు తగలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
Drunk Driving Incident: మద్యం తాగుతూ ఫుల్ స్పీడ్‌తో రైడ్.. వీడియో వైరల్
Hariram ACB Case: హరిరామ్ ఏసీబీ కస్టడీ.. నేడు, రేపు అత్యంత కీలకం
Read Latest AP News And Telugu News