Share News

Araku Bridge Damage: శిథిలావస్థకు వంతెన.. వాహనదారుల ఇక్కట్లు

ABN , Publish Date - Oct 03 , 2025 | 04:44 PM

ప్రతి రోజు గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుంటున్నారు వాహన చోదకులు. ట్రాఫిక్ పోలీసులు నియంత్రిస్తున్నప్పటికీ సింగిల్ వే వలన ట్రాఫిక్ ఇబ్బందులకు గురవుతున్నారు.

Araku Bridge Damage: శిథిలావస్థకు వంతెన.. వాహనదారుల ఇక్కట్లు
Araku Bridge Damage

అల్లూరి, అక్టోబర్ 3: అరకు - పాడేరు ప్రధాన రహదారిలో అరకు రైల్వే స్టేషన్ సమీపంలో బురదగెడ్డ వంతెన శిథిలావస్థకు చేరింది. వంతెనకు ఆనుకొని ఉన్న రహదారిలో సగానికి పైగా వర్షాలకు కొట్టుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంతెనను అనుకొని పెద్ద గొయ్యి ఏర్పడడంతో వాహనాలు ఒకే మార్గంలో వెళ్లాల్సిన పరిస్థితి. దసరా సెలవులకు పర్యాటకుల రద్దీ ఎక్కువ ఉండడంతో పెద్ద వాహనాలు వంతెన ప్రాంతంలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రతి రోజు గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుంటున్నారు వాహన చోదకులు. ట్రాఫిక్ పోలీసులు నియంత్రిస్తున్నప్పటికీ సింగిల్ వే వలన ట్రాఫిక్ ఇబ్బందులకు గురవుతున్నారు.


ట్రాఫిక్ జామ్ క్లియర్ అయ్యేందుకు సుమారు రెండు గంటల సమయం పడుతోంది. వంతెన మరమ్మత్తుల నిమిత్తం నిధులు మంజూరైనా పనులపై ఆర్‌ అండ్ బీ శాఖ దృష్టి పెట్టని పరిస్థితి. పెను ప్రమాదం సంభవించేంత వరకు వంతెనను బాగు చేయరా అని పర్యటకులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

వరద పరిస్థితులపై హోంమంత్రి అనిత ఆరా

ఉత్తరాంధ్ర వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 03 , 2025 | 04:58 PM