Visakhapatnam New Year Celebrations: న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైన విశాఖ
ABN , Publish Date - Dec 31 , 2025 | 01:01 PM
కొత్త ఏడాదికి ఘనంగా ఆహ్వానం పలకడానికి నగరవాసులు సిద్ధమవుతున్నారు. బుధవారం రాత్రి ప్రత్యేక వేడుకలు నిర్వహించేందుకు పలు స్టార్ హోటళ్లు, రిసార్టుల యాజమాన్యాలు ఏర్పాట్లు చేశాయి. తమ కార్యక్రమాలకు సినీ నటులు, గాయకులు, సెలబ్రిటీలను రప్పిస్తున్నాయి.
విశాఖపట్నం, డిసెంబర్ 31: కొత్త సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలకడానికి నగరవాసులు(Visakhapatnam New Year Celebrations) సిద్ధమవుతున్నారు. బుధవారం రాత్రి ప్రత్యేక వేడుకలు నిర్వహించేందుకు పలు స్టార్ హోటళ్లు, రిసార్టుల యాజమాన్యాలు ఏర్పాట్లు చేశాయి. తమ కార్యక్రమాలకు సినీ నటులు, గాయకులు, సెలబ్రిటీలను రప్పిస్తున్నాయి. రుషికొండలోని రాడిసన్ బ్లూ హోటల్లో జరిగే ఈవెంట్‌కు సినీ నటి హెబ్బాపటేల్ హాజరవుతున్నారు. వేడుకలకు హాజరయ్యేవారి కోసం పలు కేటగిరీల కింద టికెట్లు విక్రయిస్తున్నారు. ఇవి రూ.రెండు వేలు నుంచి రూ.50 వేలు వరకూ ఉన్నాయి.
అలాగే నోవాటెల్ హోటల్(Star Hotels New Year Vizag) న్యూ ఇయర్ గ్రాండ్ సెలబ్రేషన్స్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ జరిగే వేడుకలకు సినీ నేపథ్య గాయిని సమీరా భరద్వాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. అప్పఘర్ సమీపంలోని గాదిరాజు ప్యాలెస్‌లో కూడా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి.. సినీ ప్రముఖులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించనున్నారు. ఇంకా బీచ్ రోడ్డులోని పార్కు హోటల్, రుషికొండలోని షోర్ ఫ్రంట్ రెస్టారెంట్, భీమిలిలోని నోవాటెల్, గాజువాకలోని సిగ్నేచర్ హోటల్తో పాటు మరికొన్ని న్యూఇయర్ ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటుచేస్తున్నాయి. వీటిలో పాల్గొనాలనుకునేవారి కోసం టికెట్లను ఆన్లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంచాయి. ఆన్లైన్లో టికెట్లను బుక్ షో లేదా డిస్ట్రిక్ జొమాటో యాప్‌ల నుంచి కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంది.
Also Read:
ఆ అవార్డుల జాబితాలో హైదరాబాద్ బిర్యానికి చివరి స్థానం
మహిళా హోంగార్డుపై హెడ్ కానిస్టేబుల్ దుశ్చర్య..
మీరు కూర్చునే భంగిమ.. మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని తెలుసా..