Varla Ramaiah: వెన్నుపోటుకు.. గొడ్డలి వేట్టుకు పేటెంట్
ABN , Publish Date - Jun 02 , 2025 | 05:29 PM
వైసీపీ చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మరోసారి మండిపడ్డారు. జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా జరుపుకోవాలంటూ పిలుపు నివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి, జూన్ 02: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఫ్రస్టేషన్‌లో ఉన్నారని.. అందుకే అవాకులు.. చవాకులు మాట్లాడుతున్నారని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. సోమవారం అమరావతిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. జూన్ 4వ తేది వెన్ను పోటు దినం అనటానికి నీకు సిగ్గు లేదా? అంటూ వైఎస్ జగన్‌ను ఆయన సూటిగా ప్రశ్నించారు. వెన్నుపోటుకు.. గొడ్డలి వేట్టుకు పేటెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అభివర్ణించారు. నిన్ను కంటికి రెప్పలా పెంచిన మీ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డికి వెన్నుపోటు పొడిచావంటూ వైఎస్ జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ వెన్నుపోటుకు భయపడి నీ వద్దకు నీ తల్లి, చెల్లి సైతం రావడం లేదన్నారు.
85 శాతం ఇచ్చిన హామీలను తమ కూటమి ప్రభుత్వం ఏడాది లోపు నెరవేర్చిందని గుర్తు చేశారు. మీ ప్రభుత్వ హయాంలో మీరు ఇచ్చిన హామీలు కనీసం 15 శాతం కూడా అమలు చేయలేదని గుర్తు చేశారు. సిగ్గు ఎగ్గు లేకుండా జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినం చేస్తానని చేప్పడం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు సిద్ధమా? అంటూ వైఎస్ జగన్‌కు వర్ల రామయ్య సవాల్ విసిరారు. గడిచిన ఐదేళ్లలో ప్రజలపై మోయలేని భారం వేశావంటూ వైఎస్ జగన్‌పై నిప్పులు చెరిగారు. 2025 వార్షిక బడ్జెట్‌లో రూ. 47 వేల కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. కానీ ఎస్టీ, ఎస్సీ నిధులు సైతం దారి మళ్లించిన వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు.
లిక్కర్ స్కామ్‌లోని నిందితులు బ్లేడ్ బాచ్, గంజాయి బ్యాచ్ మధ్య జీవిస్తున్నారని వ్యంగ్యంగా అన్నారు. వైఎస్ జగన్ చెప్పింది చేయడం వల్లే.. ఒక్కప్పుడు మంచి ఆఫీసర్లు సైతం జైలు పాలవుతున్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌కు నైతిక విలువలు లేకుండా పోతున్నాయన్నారు. వైఎస్ జగన్ ముందు ఎటువంటి గ్యాంగ్‌లు పనికి రావని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
స్వర్గానికా.. నరకానికా.. కేసీఆర్ సీఎం: ఎంపీ చామల
చుండ్రు సమస్యకు సింపుల్ చిట్కాలు..
Read Latest AndhraPradesh News And Telugu News