Tirupati: ఆ రోజు మీ వాణి ఏమైంది..టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలా కల్పిత విమర్శలొద్దు
ABN , Publish Date - Oct 15 , 2025 | 01:15 PM
‘విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వెండి సింహాలు మాయం. అంతర్వేదిలో రథాలు దహనం. పిఠాపురంలో దేవాలయాల మీద దాడులు.. దేవతా విగ్రహాలు ధ్వంసం. శ్రీవారికి సీఎం హోదాలో జగన్ సతీసమేతంగా ఏనాడైనా పట్టువస్ర్తాలు సమర్పించారా.. డిక్లరేషన్‌పై సంతకం చేశారా.. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా నాడు జరిగిన సంఘటనలపై భూమన కరుణాకరెడ్డి వాణి ఏమైంది’ అంటూ ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసనంద సరస్వతి నిలదీశారు.
- నిజా నిజాలపై చర్చకు సిద్ధమా?
- భూమనపై ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడి ఆగ్రహం
తిరుపతి: ‘విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వెండి సింహాలు మాయం. అంతర్వేదిలో రథాలు దహనం. పిఠాపురంలో దేవాలయాల మీద దాడులు.. దేవతా విగ్రహాలు ధ్వంసం. శ్రీవారికి సీఎం హోదాలో జగన్ సతీసమేతంగా ఏనాడైనా పట్టువస్ర్తాలు సమర్పించారా.. డిక్లరేషన్‌పై సంతకం చేశారా.. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా నాడు జరిగిన సంఘటనలపై భూమన కరుణాకరెడ్డి వాణి ఏమైంది’ అంటూ ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసనంద సరస్వతి నిలదీశారు.
తిరుపతి(Tirupati) ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. నాస్తికుడైన భూమన హిందూ సమాజానికి ప్రతినిధిగా ప్రచారం చేసుకుంటూ తిరుమలలో ఏదో జరిగిపోతోందని టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కల్పిత విమర్శల చేయడం మానుకోవాలన్నారు. శిల్పి చెక్కి భిన్నమైపోయిన విగ్రహం ఏ దేవతామూర్తిదో తెలియకుండా విష్ణుమూర్తి అంటూ విమర్శలు చేయడం చూస్తుంటే కనీస అవగాహన లేకుండా టీటీడీ చైర్మన్‌గా ఏలా పనిచేశావో అంతుపట్టడం లేదన్నారు. టీటీడీ చైర్మన్‌గా భక్తుల గురించి పట్టించుకోకుండా అవినీతి, అక్రమాలు తదితర వ్యవహారాలతో తిరుమల కొండను అపవిత్రం చేసినప్పుడు కరుణాకర్‌రెడ్డి(Karunakar Reddy)లోని సనాతనవాది ఏమయ్యారని ప్రశ్నించారు.
తిరుమల కొండపై చేసిన అపవిత్రాలతోనే వైసీపీ 11 సీట్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. టీటీడీలో ప్రస్తుతం జరుగుతున్న మంచి కార్యక్రమాలను చూసి ఓర్వలేక పనిగట్టుకుని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. టీటీడీలో నాడు, నేటి పరిస్థితులు, ఆయన చేసిన నిరాధార ఆరోపణలపై చర్చకు రావాలని భూమనకు పిలుపునిచ్చారు. ఇలాంటి ఆరోపణలు మానుకోకపోతే గుణపాఠం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సాధు పరిషత్ సభ్యులు శివానంద స్వామి, గణేష్ స్వామి, ఓంకార్, నీలకంఠ, అరుఱణ్, మునిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
షాకింగ్ .. ఎమ్‌టీవీ మ్యూజిక్ ఛానల్ మూసివేత
Read Latest Telangana News and National News