Share News

TTD: టీటీడీకి అలిపిరిలో 35 ఎకరాలు

ABN , Publish Date - May 08 , 2025 | 04:45 AM

అలిపిరిలోని 35 ఎకరాల భూమిని టీటీడీ ఏపీ టూరిజం అథారిటీకి కేటాయించగా, పేరూరు గ్రామంలోని 10.32 ఎకరాలు సహా మొత్తం 35 ఎకరాలను టీటీడీకి బదలాయించాలని బోర్డు నిర్ణయించింది. ఈ భూకదలికకు సంబంధించి ప్రభుత్వాన్ని వేగంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ రాయనుంది

TTD: టీటీడీకి అలిపిరిలో 35 ఎకరాలు

  • బదులుగా ఏపీ టూరిజంకు మరో చోట కేటాయింపు

తిరుమల, మే 7(ఆంధ్రజ్యోతి): అలిపిరి సమీపంలో ఏపీ టూరిజం అథారిటీకి చెందిన భూమిని టీటీడీకి కేటాయించినందుకు బదులుగా ఆ సంస్థకు మరో చోట భూమి కేటాయిస్తూ బుధవారం తిరుమలలో జరిగిన టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం నిర్ణయం తీసుకుంది. చైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఆధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఈవో శ్యామలరావు, ఏఈవో వెంకయ్య చౌదరి, సభ్యులు ప్రశాంతిరెడ్డి, పనబాక లక్ష్మీ, జాస్తి పూర్ణసాంబశివరావు, సదాశివరావు శాంతారామ్‌, జానకీదేవి, భానుప్రకాశ్‌ రెడ్డి హాజరయ్యారు. మిగిలిన సభ్యులు వర్చువల్‌గా పాల్గొన్నారు. తిరుపతి రూరల్‌ మండలం పేరూరు గ్రామం పరిధిలోని సర్వే నం.604లో 24.68 ఎకరాల ఏపీ టూరిజంకు చెందిన భూమిని టీటీడీకి బదలాయించాలని గతంలోనే తీర్మానం చేశారు. తాజాగా అదే సర్వే నం.లోని ఏపీటీఏకు చెందిన మరో 10.32 ఎకరాల భూమిని టీటీడీకి బదలాయించాలని బోర్డు తీర్మానం చేసింది. ఈ స్థలాలకు బదులుగా తిరుపతి అర్చన్‌ సర్వే నం.588-ఏలో టీటీడీకి చెందిన 35 ఎకరాల స్థలాన్ని ఏపీటీఏకు కేటాయించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాయాలని నిర్ణయించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పహల్గామ్ దాడిలో మరో కుట్ర..

ఆపరేషన్ సింధూర్‌పై చిరంజీవి ట్వీట్

ఎమర్జెన్సీ ప్రకటించిన పాకిస్తాన్..

For More AP News and Telugu News

Updated Date - May 08 , 2025 | 04:45 AM