Srivari Volunteers in Tirumala: తిరుమలలో శ్రీవారి సేవకులకు శిక్షణ
ABN , Publish Date - Sep 04 , 2025 | 02:53 AM
తిరుమలలో శ్రీవారి సేవకులకు శిక్షణ ఇవ్వనున్నామని టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు...
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
తిరుమల, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): తిరుమలలో శ్రీవారి సేవకులకు శిక్షణ ఇవ్వనున్నామని టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన శిక్షణ ట్రైనర్ మాడ్యూల్‌ను టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ.. 2000లో ప్రారంభమైన ‘శ్రీవారిసేవ’ ద్వారా ఇప్పటివరకు 17లక్షల మంది స్వచ్ఛందంగా పాల్గొన్నారన్నారు. రోజూ 3,500 మంది టీటీడీలోని పలు విభాగాల్లో సేవలందిస్తున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు శ్రీవారిసేవ వ్యవస్థలో పలు సంస్కరణలు తీసుకువచ్చామని.. ఈ క్రమంలోనే శ్రీవారి సేవకులకు, గ్రూప్ సూపర్‌వైజర్లకు ‘ట్రైనర్ల’తో నిరంతరం శిక్షణ ఇస్తామన్నారు. ట్రైనర్ల శిక్షణ కోసం ఐఐఎం(అహ్మదాబాద్), డైరెక్టర్ ప్లానింగ్ ఆఫ్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో టీటీడీ వెబ్‌సైట్‌లో ‘ట్రైనర్’ మాడ్యూల్ అప్షన్‌ను బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.
పారదర్శకంగాహోటళ్ల కేటాయింపు
ఈవో, అదనపు ఈవో మాట్లాడుతూ.. తిరుమలలోని ఐదు జనతా, ఐదు బిగ్ క్యాంటీన్లను ఇటీవల పారదర్శకంగా కేటాయించామన్నారు. కొత్త పాలసీని రూపొందించి నిపుణుల కమిటితో ఆయా సంస్థల కార్యకలాపాలు క్షేత్రస్థాయిలో పరిశీలించాక కేటాయింపు జరిగిందన్నారు. తక్కువ ధరకు నాణ్యమైన ఆహారాన్ని అందించేలా బ్రాండెడ్ హోటళ్లను ఎంపిక చేశామన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే ఆయా హోటళ్లను కేటాయించిన లైసెన్సులను రద్దు చేస్తామని స్పష్టం చేశారు.
తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. నువ్వొస్తానంటే.. నే రానిస్తానా..!
పౌరుషానికి ప్రతీక నందమూరి హరికృష్ణ..
Read Latest Andhra Pradesh News and National News