-
-
Home » Andhra Pradesh » Today Breaking News Train Accident Updates, CM Chandrababu and Revanth Reddy Davos Tour, Investments in ap, Telangana Republic Day Celabrations News PM Modi and Delhi Assembly Elections Latest Telugu News Updates Thursday 23rd january 2025 Amar
-
Breaking News: చర్చ్‌లోకి వెళ్లి తాళాలు వేసుకున్న పాస్టర్.. అసలేమైందంటే..
ABN , First Publish Date - Jan 23 , 2025 | 10:16 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
2025-01-23T19:07:52+05:30
చర్చ్‌లోకి వెళ్లి తాళాలు వేసుకున్న పాస్టర్.. అసలేమైందంటే..
హైదరాబాద్ : ముషీరాబాద్ హెబ్రోన్ చర్చ్ వద్ద ఉద్రిక్తత.
చర్చ్‌పై తమకు హక్కు ఉందంటూ రెండు వర్గాల గొడవ.
ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు.
చర్చ్‌లోకి వెళ్లి తాళాలు వేసుకున్న పాస్టర్ వీరాచారి వర్గం.
తాళాలు పగలగొట్టే యోచనలో పోలీసులు.
సుమారు 100 మంది పోలీసులు మోహరింపు.
-
2025-01-23T17:57:59+05:30
ఐటీ సోదాలు.. కోపంతో దిల్‌రాజు ఏం చేశారంటే..
సినీ నిర్మాత దిల్ రాజు నివాసంలో మూడో రోజు కొనసాగుతున్న సోదాలు.
దిల్ రాజు నివాసంలోని డాక్యుమెంట్లను తనిఖీ చేస్తున్న ఐటి అధికారులు.
ఐటి అధికారిణితో దిల్ రాజు ఆర్గ్యుమెంట్.
ఐటి అధికారిణి మాట్లాడుతుండ సీరియస్‌గా వెళ్ళిపోయిన దిల్ రాజు.
-
2025-01-23T17:41:24+05:30
దావోస్ నుంచి ఢిల్లీకి చేరుకోనున్న సీఎం చంద్రబాబు..
గురువారం నాడు దావోస్ నుంచి ఢిల్లీకి చేరుకోనున్న సీఎం చంద్రబాబు.
గురువారం అర్థరాత్రి 12.30 గంటలకు దావోస్ నుంచి ఢిల్లీ చేరుకోనున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
శుక్రవారం నాడు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులను కలుసుకోనున్నారు.
కేంద్ర ఆర్ధిక, వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖల మంత్రులను కలవనున్నారు.
ఫిబ్రవరి 1న పార్లమెంటు ముందుకు కేంద్ర బడ్జెట్ రానున్న నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు.
ఉదయం 11గంటలకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అవుతారు.
ఆ తర్వాత మధ్యాహ్నం 12గంటలకు మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు.
వ్యవసాయ, గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ తరవాత విజయవాడ బయలుదేరనున్నారు.
సమయం ఇస్తే.. పునరుత్పాధక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కూడా కలిసే అవకాశం ఉంది.
-
2025-01-23T13:38:44+05:30
హైదరాబాద్ లో ఇన్ఫోసిస్ భారీ విస్తరణ
తెలంగాణలో కొత్తగా 17వేల ఐటీ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో తమ ఐటీ క్యాంపస్‌ను విస్తరించనున్న ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్
పోచారంలోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో అదనంగా 17 వేల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికలుల సిద్ధం చేసిన ఇన్పోసిస్
దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ఇన్ఫోసిస్ సీఎఫ్‌వోతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు సమావేశం
-
2025-01-23T13:33:42+05:30
తెలంగాణకు భారీ పెట్టుబడులు..
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి
దావోస్ వేదికపై తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ
రూ.60వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన అమెజాన్
దావోస్ లో తెలంగాణ సర్కార్ తో అమెజాన్ ఏంవోయూ
డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం
దావోస్ వేదికగా పెట్టుబడుల సమీకరణలో ఇప్పటికే కొత్త రికార్డు నెలకొల్పిన తెలంగాణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని దావోస్‌లో అతి పెద్ద పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం
హైదరాబాద్‌లో రూ.60వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ కంపెనీ అంగీకరం
ఒక బిలియన్ పెట్టుబడులతో రాష్ట్రంలో మూడు సెంటర్లను గతంలోనే అభివృద్ధి చేసిన అమెజాన్
కొత్తగా చేపట్టే విస్తరణ ప్రణాళికలకు అవసరమైన భూమిని కేటాయించాలని రాష్ట్రప్రభుత్వానికి అమెజాన్ విజ్ఞప్తి
-
2025-01-23T13:11:31+05:30
రుణమాఫీపై మంత్రి కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు
పదేళ్ల విధ్వంస పాలనకు గురైన రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ చేశాము
గత ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డును తాకట్టు పెట్టి కొంతమంది రైతులకు రైతు బంధు వేశారు
పదేళ్ళుగా రేషన్ కార్డులు ఇవ్వలేని గత ప్రభుత్వం గ్రామ సభలకు అడ్డుతగులుతుంది.
నల్గొండలో రైతులు ఎందుకు దీక్ష చేస్తారు
దొడ్డు బియ్యం మాఫియా ఉండటంతో ప్రజలకు సన్నబియ్యం అందిస్తున్నాం
పదేళ్ళు రుణమాఫీ ఎందుకు చేయలేదని నల్గొండ బిఆర్ఎస్ పార్టీ రైతు దీక్షలో నిలదీయండి
జనవరి 26 నుంచి రైతులకు రైతు భరోసా ఇస్తాం
సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి లక్ష కోట్ల పెట్టుబడులు తీసుకొని వస్తున్నారు
-
2025-01-23T12:38:20+05:30
గ్రామసభలో గందరగోళం
ములుగు జిల్లా మల్లంపల్లి మండలం మహమ్మద్ గౌస్ పల్లి గ్రామ సభలో గందరగోళం
అనర్హుల పేర్లు లబ్ధిదారుల జాబితాలో ఉన్నాయంటూ కొందరు గ్రామస్తుల ఆగ్రహం
అర్హులకు ప్రభుత్వ పథకాలు అందించాలని డిమాండ్
-
2025-01-23T10:16:17+05:30
రోడ్డు ప్రమాదం..
పుంగనూరులో రోడ్డు ప్రమాదం. ఇద్దరు మృతి..
పుంగనూరు మండలం ఎటవాకిలి క్రాస్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ
మృతులు గంగాధర (45), వెంకటరమణ(54)