Share News

Breaking News: ఆర్టీసీ బస్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం..

ABN , First Publish Date - Feb 19 , 2025 | 08:48 AM

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: ఆర్టీసీ బస్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం..
Breaking News

Live News & Update

  • 2025-02-19T11:39:16+05:30

    ఆర్టీసీ బస్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం..

    • కుషాయిగూడ ఆర్టీసీ బస్ డిపోలో భారీగా చెలరేగిన మంటలు.

    • డిపోలో పార్కింగ్ చేసిన 2 బస్సుల్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించి క్షణాల్లో బస్లు దగ్ధం అయ్యాయి.

    • దీంతో డిపోలో పనిచేస్తున్న మెకానిక్లు, ఉద్యోగులు భయాందోళనతో పరుగులు.

    • ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది.

    • ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

  • 2025-02-19T10:53:03+05:30

    ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన జ్ఞానేశ్ కుమార్

    • ఢిల్లీ: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన జ్ఞానేశ్ కుమార్

    • జ్ఞనేశ్ కుమార్‌కి అభినందనలు తెలిపిన ఎన్నికల కమిషనర్ సుఖ్బిర్ సింగ్ సంధు

    • దేశ నిర్మాణానికి తొలి అడుగు ఓటింగ్‌ అని బాధ్యతల స్వీకరణ సందర్భంగా చెప్పిన జ్ఞానేశ్ కుమార్

    • 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయుడు ఎలక్టర్‌గా మారాలని కోరిన నూతన సీఈసీ

    • ఎన్నికల వేళ ప్రతి ఒక్క ఓటరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న నూతన సీఈసీ

    • భారత రాజ్యాంగం, ఎన్నికల చట్టాల ద్వారా భారత ఎన్నికల సంఘం ఎల్లప్పుడూ ఓటర్లతో ఉంటుందన్న జ్ఞానేశ్ కుమార్

  • 2025-02-19T10:31:19+05:30

    పునఃప్రారంభం కానున్న మదనపల్లె సబ్ కలెక్టరేట్

    • అన్నమయ్య జిల్లా: నేడు పునఃప్రారంభం కానున్న మదనపల్లె సబ్ కలెక్టరేట్

    • కార్యక్రమానికి హాజరుకానున్న రెవెన్యూ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ ఆర్‌పీ సిసోడియా

    • గతేడాది జులై 21న సబ్ కలెక్టరేట్‌లో దుమారం రేపిన ఫైళ్ల దహనం ఘటన

    • ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించి ఫైళ్లు దహనం అయ్యినట్లు గుర్తించిన రెవెన్యూ అధికారులు

    • కీలక ఫైళ్ల దహనంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల కుట్ర ఉన్నట్లు అధికారుల అనుమానం

    • ఫైళ్ల దగ్ధంపై మెుత్తం 9 మందిపై కేసులు నమోదు చేసిన సీఐడీ పోలీసులు

    • అప్పటి ఆర్డీవోలు మురళి, హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజపై కేసు నమోదు, సస్పెన్షన్

    • వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ జింక వెంకటాచలపతిపై కేసు నమోదు

    • అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి పీఏ తుకారాం, ముఖ్య అనుచరుడు మాధవరెడ్డి, శశికాంత్ పైనా కేసులు నమోదు

    • ఈ కేసులో సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు

    • ఏసీబీ కేసులో ఆర్డీవో మురళిని అరెస్టు, ఏడు నెలల తర్వాత మళ్లీ నేడు ప్రారంభం కానున్న సబ్ కలెక్టరేట్

  • 2025-02-19T09:42:06+05:30

    బర్డ్ ఫ్లూ కలకలం..

    • వనపర్తి: మధనాపురం మండలం కొన్నూరులో బర్డ్ ఫ్లూ కలకలం

    • శివకేశవరెడ్డికి చెందిన కోళ్ల ఫామ్‌లో బర్డ్ ఫ్లూ సోకి మత్యువాత పడిన 3,000 కోళ్లు

    • అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని బాధితుడు ఆగ్రహం

    • గ్రామ శివారులోనే గోతి తీసి 3 వేల కోళ్లను పూడ్చిన కోళ్ల ఫామ్ యజమాని

  • 2025-02-19T09:35:19+05:30

    సీసీసీ సెంటర్‌లో గుర్తుతెలియని వ్యక్తి హల్‌చల్

    • హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని సీసీసీ సెంటర్‌లో గుర్తుతెలియని వ్యక్తి హల్‌చల్

    • సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహిస్తున్న సమయంలోనే మూడుసార్లు వచ్చివెళ్లిన నిందితుడు

    • గుర్తుతెలియని వ్యక్తిని జ్ఞానసాయి ప్రసాద్‌గా గుర్తించి కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు

    • టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ అంటూ ప్రచారం చేసుకున్న నిందితుడు జ్ఞానసాయి ప్రసాద్

    • సీసీసీ సెంటర్ ఎదురుగా ఉన్న హోటల్లోకి వెళ్లి వ్యాపార లావాదేవీల పేరుతో గోవర్ధన్ అనే వ్యక్తి నుంచి డబ్బులు వసూలు

    • గోవర్ధన్ నుంచి రూ.3 లక్షలు వసూలు చేసిన నిందితుడు జ్ఞానసాయి ప్రసాద్

    • సీఎం ఉన్న సమయంలోనే సీసీసీ సెంటర్‌లోకి నిందితుడు వచ్చి వెళ్లడంపై పోలీసులు సీరియస్

    • హోటల్‌తోపాటు సీసీసీలో సీసీ ఫుటేజ్‌లను సేకరించి విచారణ చేస్తున్న పోలీసులు

  • 2025-02-19T09:18:55+05:30

    ఢిల్లీ సీఎంపై నేటితో వీడనున్న ఉత్కంఠ

    • ఢిల్లీ: ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం

    • బీజేఎల్పీ సమావేశంలో ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిపై స్పష్టత వచ్చే అవకాశం

    • బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో బీజేఎల్పీ నేతను ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు

    • సమావేశంలో పాల్గొననున్న కొత్తగా ఎన్నికైన 48 మంది ఎమ్మెల్యేలు, ఢిల్లీ బీజేపీ ఎంపీలు

    • బీజేఎల్పీ నేత ఎన్నిక తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలవనున్న నేతలు

    • ఇప్పటికే సీఎం ప్రమాణస్వీకారం కోర్డినేటర్లుగా వినోద్ తావ్డే, తరుణ్ చుగ్‍ను నియమించిన బీజేపీ అధిష్ఠానం

    • సీఎం అభ్యర్థిపై స్పష్టత వచ్చిన తర్వాత గురువారం నాడు ముఖ్యమంత్రి, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం

    • ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో పర్వేష్ వర్మ, రేఖా గుప్తా, విజేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ్, ఆశిశ్ సూద్, పవన్ శర్మ, అజయ్ మహావార్

    • రామ్ లీలా మైదానంలో ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేసిన ఢిల్లీ ప్రభుత్వ అధికారులు

    • ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్న ఎన్డీయే కీలక నేతలు

  • 2025-02-19T08:58:55+05:30

    మరోసారి ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు..

    • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి పర్యటన షెడ్యూల్

    • బుధవారం ఉదయం 11 గంటలకు సచివాలయానికి వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

    • ఉదయం 11:30 గంటలకు యూఎస్ ప్రతినిధులతో భేటీ కానున్న సీఎం

    • యూఎస్ ప్రతినిధులతో జీరో బడ్జెట్ నేచర్ ఫార్మింగ్‌పై అవగాహన ఒప్పందం

    • అనంతరం మధ్యాహ్నం 12:30 వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్‌పై అధికారులతో సమీక్షించనున్న చంద్రబాబు

    • సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్న సీఎం చంద్రబాబు

  • 2025-02-19T08:48:32+05:30

    సుప్రీంకోర్టులో నేడు కీలక కేసు విచారణ..

    • ఢిల్లీ: సుప్రీంకోర్టులో నేడు ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్ కేసు విచారణ

    • 2023లో సెలక్షన్ ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తప్పిస్తూ చట్టం చేసిన కేంద్రం

    • కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లు

    • కేసు విచారణ జరపనున్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం