Achchennaidu: నెలాఖరులోగా పొగాకు కొనుగోళ్లు పూర్తి
ABN , Publish Date - Sep 04 , 2025 | 03:20 AM
రాష్ట్రంలో నల్ల బర్లీ పొగాకు కొనుగోళ్లను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు...
అక్టోబరు 1 నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం: అచ్చెన్న
అమరావతి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నల్ల బర్లీ పొగాకు కొనుగోళ్లను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. బుధవారం అమరావతి సచివాలయంలో మార్క్‌ఫెడ్, పొగాకు కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 80మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి జరగ్గా.. 22 కంపెనీలు 40మిలియన్ కిలోలు కొనగా, మార్క్‌ఫెడ్ 15 మిలియన్ కిలోలు కొనుగోలు చేసిందన్నారు. మిగిలినదానిలో 20మిలియన్ కిలోలను ప్రైవేట్ కంపెనీలు, మరో 5 మిలియన్ కిలోలను మార్క్‌ఫెడ్ ఈ నెలాఖరుకు కొనుగోలు చేయాలన్నారు. 2025-26 రబీ సీజన్‌లో నల్ల బర్లీ పొగాకును ఎవరూ పండించొద్దన్నారు. కంపెనీలతో ఎంవోయూలు చేసుకున్న రైతులు మాత్రమే తెల్ల బర్లీ పొగాకు వేయాలని మంత్రి సూచించారు.
తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. నువ్వొస్తానంటే.. నే రానిస్తానా..!
పౌరుషానికి ప్రతీక నందమూరి హరికృష్ణ..
Read Latest Andhra Pradesh News and National News