Share News

Tirupati: విచిత్రాల వీధులు

ABN , Publish Date - Feb 17 , 2025 | 02:23 AM

ఇది... నగరంలోని స్కావెంజర్స్‌ కాలనీ! మొన్నటిదాకా తిరుపతిలోనే అత్యంత మురికి వాడ! భరించలేని వాసన, చెత్త.. మధ్యే స్థానికుల జీవితాలు! ఇప్పుడు ఇక్కడ జీవన ‘చిత్రం’ మారిపోతోంది.

Tirupati: విచిత్రాల వీధులు

మురికివాడకు రంగుల శోభ

రూపు మారిన తిరుపతి స్కావెంజర్స్‌ కాలనీ

హరివిల్లు నేలకు దిగినట్లు రకరకాల రంగులు! చూడగానే ఆకట్టుకునేలా మంచి మంచి బొమ్మలు! ప్రతి వీధీ ‘చిత్ర’ విచిత్రమే! ప్రతి గోడా వర్ణభరితమే! ఈ ‘బొమ్మల కొలువు’ చూడాలంటే తిరుపతికి వెళ్లాల్సిందే. ఇది... నగరంలోని స్కావెంజర్స్‌ కాలనీ! మొన్నటిదాకా తిరుపతిలోనే అత్యంత మురికి వాడ! భరించలేని వాసన, చెత్త.. మధ్యే స్థానికుల జీవితాలు! ఇప్పుడు ఇక్కడ జీవన ‘చిత్రం’ మారిపోతోంది.

2.jpg

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజమే! వీధుల పరిశీలనలో భాగంగా ఇటీవల స్కావెంజర్స్‌ కాలనీకి వెళ్లిన తిరుపతి మునిసిపల్‌ కమిషనర్‌ మౌర్య అక్కడి పరిస్థితులు చూసి చలించిపోయారు. కాలనీలో దాదాపు 300కు పైగా కుటుంబాలు నివసిస్తుండగా, ఇందులో సగానికి పైగా మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పనిచేసే పారిశుధ్య కార్మికులే.


ఊరంతా శుభ్రం చేసే కార్మికులుండే ప్రాంతం కూడా అందంగా, శుభ్రంగా ఉండాలని కమిషనర్‌ భావించారు.

3.jpg

స్మార్ట్‌ సిటీ-స్వచ్ఛ సర్వేక్షణ్‌ నిధులతో మురికివాడకు రంగులు వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికీ అందమైన రంగులను వేయించారు. దీంతో స్కావెంజర్స్‌ కాలనీ సరికొత్త రంగులద్దుకుంది. ఇరుకిరుగ్గా సున్నం కూడా లేకుండా ఉండే ఇళ్ల గోడలపై హరివిల్లులు రూపుదిద్దుకున్నాయి. తాజాగా ఆదివారం స్కావెంజర్స్‌ కాలనీలో కమిషనర్‌ మౌర్య పర్యటించి బొమ్మలు వేసేవారికి కొన్ని సలహాలు ఇచ్చారు.

- తిరుపతి, ఆంధ్రజ్యోతి


Also Read:

గుడ్ న్యూస్.. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడో చెప్పేసిన చంద్రబాబు..

భారీ స్కామ్.. పెట్టుబడుల పేరుతో రూ.850 కోట్లకు..

For More National News and Telugu News..

Updated Date - Feb 17 , 2025 | 02:23 AM