TTD : తిరుపతిలో నేటి నుంచి ఐటీసీఎక్స్-2025
ABN , Publish Date - Feb 17 , 2025 | 01:39 AM
ఉత్తమ పద్ధతులను అన్వేషించడం, స్థిరమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటుచేయడం, డిజిటలైజేషన్,

హాజరుకానున్న ఏపీ, గోవా, మహారాష్ట్ర సీఎంలు
తిరుపతి, ఫిబ్రవరి16(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ దేవాలయాల సదస్సుకు తిరుపతి వేదికగా నిలిచింది. ఆలయ నిర్వహణకు సంబంధించి వినూత్న విధానాలు, ఉత్తమ పద్ధతులను అన్వేషించడం, స్థిరమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటుచేయడం, డిజిటలైజేషన్, ఆలయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం వంటి వ్యూహాలపై దృష్టి సారించడమే లక్ష్యంగా ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో (ఐటీసీఎక్స్) సదస్సు జరగనుంది. సోమవారం జరిగే ప్రారంభ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, ఆర్‌ఎ్‌సఎస్ ప్రతినిధి సీఆర్ ముకుంద్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఐటీసీఎక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆలయాల ప్రతినిధులు హాజరుకానున్నారు. 58 దేశాల్లోని సుమారు 1600 ఆలయ, ఆధ్యాత్మిక సంస్థలు ఆన్‌లైన్ ద్వారా ఎక్స్‌పోతో కనెక్ట్ కానున్నట్టు వెల్లడించారు.
Also Read:
గుడ్ న్యూస్.. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడో చెప్పేసిన చంద్రబాబు..
భారీ స్కామ్.. పెట్టుబడుల పేరుతో రూ.850 కోట్లకు..
For More National News and Telugu News..