ACB Arrests Kurnool Labour Dept JC Balu Nayak : కర్నూలు కార్మిక శాఖ జాయింట్ కమిషనరు బాలు నాయక్ అరెస్టు
ABN , Publish Date - Aug 23 , 2025 | 07:42 PM
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే కేసులో కర్నూలు కార్మిక శాఖ జాయింట్ కమిషనరు (జేసీ) బాలు నాయక్ అరెస్ట్ అయ్యారు. రెండవ రోజు ఏసీబీ అధికారులు 11 చోట్ల సోదాలు జరిపారు.
తిరుపతి, ఆగస్టు 23 : ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే కేసులో కర్నూలు కార్మిక శాఖ జాయింట్ కమిషనరు (జేసీ) బాలు నాయక్ అరెస్ట్ అయ్యారు. తిరుపతి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి బాలు నాయక్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్ నిమిత్తం ఆయన్ను నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలింపు తరలించారు.
కాగా, రెండవ రోజు ఏసీబీ అధికారులు రాఘవేంద్రనగర్లోని బాలు నాయక్ ఇంటితోపాటు, కర్నూలులోని కార్యాలయం, అద్దె ఇల్లు, కుటుంబీకులు, బంధువుల ఇళ్లు, అన్నమయ్య జిల్లాలోని పౌల్ట్రీ ఫారంతో పాటు 11 ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు చేశారు. ఏసీబీ ఎఎస్పీ విమలకుమారి నేతృత్వంలో ఈ సోదాలు జరిపారు.
బాలునాయక్ కుమారుడు నిర్వహిస్తున్న ఆర్సీ సర్జికల్ షాపులోనూ తనిఖీలు చేశారు. ఇంట్లో పలు కీలక రికార్డులు, అర కేజీ బంగారు నగలు, కిలో వెండి వస్తువులు, 3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆయన స్వగ్రామమైన రాయచోటి సమీపంలోని బిడికి తాండా, రాయచోటి, మదనపల్లె, చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇళ్లు, అపార్టుమెంట్లు, పౌల్ట్రీ ఫారాలు, భూములకు సంబంధించి డాక్యుమెంట్ల ద్వారా 10 ఎకరాల భూమి గుర్తించారు.
సంబేపల్లిలో ఆయన కుమారుల పేరుతో పౌల్ట్రీఫారం ఉన్నట్లు గుర్తించారు. వివిధ బ్యాంకులలో 18 ఖాతాలు, 25 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా ఏసీబీ గుర్తించింది. దీంతోపాటు, మూడు టూవీలర్లు, రెండు కార్లు ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల మేరకు బాలు నాయక్ ఆస్తులు మూడు కోట్లుగా ఉండగా, మార్కెట్ వ్యాల్యు సుమారుగా 20 కోట్లు పైనే ఉంటుందని అంచనా. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు తేలడంతో బాలునాయక్ ను తిరుపతి ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. ఈ ఫొటోలో మొత్తం ఎన్ని సింహాలున్నాయో 12 సెకెన్లలో కనిపెట్టండి..
వావ్.. ఏం తెలివి.. ఉల్లిపాయలను కట్ చేయడానికి ఈమె ట్రిక్ చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..