Andhra Pradesh High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్‌కు ముగ్గురు న్యాయమూర్తుల బదిలీ
ABN , Publish Date - Oct 14 , 2025 | 08:11 PM
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. రాష్ట్రపతి ఆమోదం మేరకు తాజాగా బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముగ్గురు జడ్జిలను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని గతంలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. రాష్ట్రపతి ఆమోదం మేరకు తాజాగా బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి (Judges transferred to AP). గుజరాత్ హైకోర్టు నుంచి జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్, అలహాబాద్ హైకోర్టు నుంచి జస్టిస్ డూండి రమేష్, కలకత్తా హైకోర్టు నుంచి జస్టిస్ సుబేందు సమంత తాజాగా ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు.
ముగ్గురు జడ్జిలను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని గతంలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. కొలీజియం సిఫారసు మేరకు బదిలీకి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం
విశాఖ గూగుల్ ఏఐ హబ్.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం: ప్రధాని మోదీ
Read Latest AP News And Telugu News