Share News

Vemuru Ravikumar: తెలుగువారు ఎక్కడున్నా అగ్రభాగాన ఉండాలి

ABN , Publish Date - Jun 28 , 2025 | 04:11 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు, ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ అధ్యక్షుడిగా డాక్టర్‌ వేమూరు రవికుమార్‌ శుక్రవారం తాడేపల్లిలోని సంస్థ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.

Vemuru Ravikumar: తెలుగువారు ఎక్కడున్నా అగ్రభాగాన ఉండాలి

  • ఏపీఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు వేమూరు రవికుమార్‌

తాడేపల్లి టౌన్‌, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు, ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ అధ్యక్షుడిగా డాక్టర్‌ వేమూరు రవికుమార్‌ శుక్రవారం తాడేపల్లిలోని సంస్థ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఎన్నారైలను రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తామన్నారు. అమరావతిలో ఏపీఎన్‌ఆర్‌టీ ఐకానిక్‌ టవర్‌ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. రవికుమార్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్‌బాబు, ఇంటూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jun 28 , 2025 | 04:11 AM