WEF: జ్యూరిక్ చేరుకున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. మరికాసేపట్లో..
ABN , Publish Date - Jan 20 , 2025 | 12:42 PM
అమరావతి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్ (Switzerland) దేశం జ్యూరిక్ (Zurich) చేరుకున్నారు. ఆదివారం అర్దరాత్రి ఢిల్లీ నుంచి ఏపీ సీఎం చంద్రబాబు బయలుదేరగా.. సింగపూర్ పర్యటన ముగించుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) జ్యూరిక్‌కు వెళ్లారు.
అమరావతి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్ (Switzerland) దేశం జ్యూరిక్ (Zurich) చేరుకున్నారు. ఆదివారం అర్దరాత్రి ఢిల్లీ నుంచి ఏపీ సీఎం చంద్రబాబు బయలుదేరగా.. సింగపూర్ పర్యటన ముగించుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) జ్యూరిక్‌కు వెళ్లారు. వీరిద్దరూ ఇవాళ (సోమవారం) ఉదయం జ్యూరిక్ చేరుకున్నారు. జ్యూరిక్‌లోని హోటల్ హిల్టన్(Hotel Hilton)లో నిర్వహిస్తున్న "తెలుగు డయాస్పొరా మీట్"(Telugu Diaspora Meet)లో వీరిద్దరూ పాల్గొనున్నారు.
TTD: తిరుమలలో సోమవారం నుంచి యధావిధిగా దర్శనాలు ప్రారంభం
ఈ సమావేశంలో స్విట్జర్లాండ్ సహా యూరప్ దేశాల్లో నివసిస్తున్న తెలుగు పారిశ్రామికవేత్తలు, కంపెనీల సీఈఓలు, తెలుగు సంఘాలు పాల్గొనున్నాయి. స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. చంద్రబాబుతోపాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్ ఉన్నారు. ఈ సమావేశం అనంతరం రోడ్డుమార్గాన దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల్లో తెలుగు ముఖ్యమంత్రులు పాల్గొనున్నారు. కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రులు దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు హాజరవుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
TDP: వైసీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు: పల్లా
YS Sharmila: అన్నపై సంచలన కామెంట్లు చేసిన వైఎస్ షర్మిల.. బాబోయ్.. ఇలా అనేశారేంటి..