Bhatti : విశాఖలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 17 , 2025 | 02:02 PM
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విశాఖపట్నలో కీలక వ్యాఖ్యలు చేశారు. వరద జలాలపై ఇరు రాష్ట్రాల వాటా తేలిన తర్వాత కొత్త ప్రాజెక్టులు నిర్మించుకుంటే న్యాయబద్ధంగా ఉంటుందన్నారు. మా అవసరాలు తీరకుండా దిగువ ప్రాజెక్టులు నిర్మిస్తే..
విశాఖ, ఆగస్టు 17 : ఏపీకి వెళ్లిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విశాఖపట్నలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చుకున్నదే నదీ జలాల కోసం, బీడు భూములను సాగులోకి తెచ్చుకోవడం కోసమని చెప్పిన భట్టి విక్రమార్క.. వరద జలాలపై ఇరు రాష్ట్రాల వాటా తేలిన తర్వాత కొత్త ప్రాజెక్టులు నిర్మించుకుంటే న్యాయబద్ధంగా ఉంటుందన్నారు. 'మా అవసరాలు తీరకుండా దిగువ ప్రాజెక్టులు నిర్మిస్తే.. ఆ తర్వాత కేటాయింపుల సమస్యలు ఎక్కువవుతాయి' అని భట్టి అన్నారు.
నీటి వాటాలను తేల్చాల్సిన బాధ్యత కేంద్రానిది అని చెప్పిన భట్టి.. రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పారు. ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్, దేవాదులు వంటి గోదావరిపై మేం చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి కాలేదని.. మా ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత వాటాలు తేల్చి మిగిలిన వాటిని సమృద్ధి గా వాడుకోవచ్చని ఆయన అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా భట్టి.. తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతి లేదని వ్యాఖ్యానించారు. పార్టీ బలంగా ఉండాలని రాజగోపాల్‌రెడ్డి కూడా కోరుతున్నారని భట్టి చెప్పుకొచ్చారు. భవిష్యత్‌లో ఏపీలో కూడా కాంగ్రెస్ బలపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు, రేవంత్, రాహుల్ గురించి వైఎస్ జగన్ హాట్ లైన్ వ్యాఖ్యలపై స్పందించిన భట్టి.. అవి వ్యక్తిగతమైన రాజకీయ ఆరోపణలు అని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పార్టీ విధానాలు విశాలమైన ప్రయోజనాలతో ఉంటాయి తప్ప సంకుచితమైన మనస్తత్వంతో ఉండవన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి
Read Latest Telangana News and National News