TDP MP Kalishetti Appalanayudu: జగన్... రాజకీయ రాబందు
ABN , Publish Date - Jul 18 , 2025 | 04:42 AM
సీఎం చంద్రబాబు వయస్సుపై జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఖండించారు.
చంద్రబాబుపై ఆయన వ్యాఖ్యలు అనుచితం: ఎంపీ కలిశెట్టి
న్యూఢిల్లీ, జూలై 17(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు వయస్సుపై జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఖండించారు. గురువారం ఏపీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు ఒక వ్యక్తి కాదు... వ్యవస్థ. ఆయనపై జగన్ వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారు. నదుల అనుసంధానం, ప్రజలకు సంక్షేమ పాలన, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాత్రింబవళ్లు చంద్రబాబు కష్టపడుతుంటే... జగన్ మాత్రం శవ రాజకీయాలు చేస్తున్నారు. జగన్ పార్టీ పుట్టిందే శవాల మీద. సహజ మరణాలు సంభవించినా వాటిని జగన్ రాజకీయ హత్యలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన, ఆయన పార్టీ నేతలు రాజకీయ రాబందులుగా వ్యవహరిస్తున్నారు. దేశ రాజకీయాల్లో సీఎం చంద్రబాబుకు పెరుగుతున్న ఆదరణను జగన్ ఓర్వలేకపోతున్నారు’ అని ఎంపీ ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్