బడ్జెట్‌పై వైసీపీ నేతల దుష్ప్రచారం: అనురాధ
ABN , Publish Date - Mar 02 , 2025 | 05:24 AM
ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ, మండలిలో చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ విమర్శించారు.
అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే మెరుగైన బడ్జెట్‌ని ప్రవేశపెడితే.. వైసీపీ నేతలు తప్పుడు లెక్కలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ, మండలిలో చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ విమర్శించారు. ప్రజలు వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసినా జగన్‌కు బుద్ధి రాలేదన్నారు. బడ్జెట్ కేటాయింపుల విషయంలోనూ వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని, ఆ పార్టీ పుట్టుకే అబద్దాల పునాదులపై జరిగిందని దుయ్యబట్టారు.