TANA : అమెరికాలోని చార్లెట్‌లో కూచిపూడి ప్రాక్టికల్ పరీక్షలు
ABN , Publish Date - Sep 24 , 2025 | 09:58 PM
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, అనుబంధ సంస్థ అయిన తానా కళాశాల, అమెరికాలోని చార్లెట్‌లో కూచిపూడి ప్రాక్టికల్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షలను పర్యవేక్షించి, నిర్వహించడానికి తిరుపతి నుండి..
ఇంటర్నెట్ డెస్క్: తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (ఎస్‌పిఎంవివి), అనుబంధ సంస్థ అయిన తానా కళాశాల, అమెరికాలోని చార్లెట్‌లో కూచిపూడి ప్రాక్టికల్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షలను పర్యవేక్షించి, నిర్వహించడానికి తిరుపతి నుండి విచ్చేసిన డా. ఉప్పరి హిమబిందు (ఎం.పి.ఎ. డ్యాన్స్, ఎం.ఫిల్., పి.హెచ్.డి., అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మ్యూజిక్, డ్యాన్స్, ఫైన్ ఆర్ట్స్, ఎస్‌పిఎంవివి) వారిని తానా సగౌరవంగా ఆహ్వానించింది.
ఈ కార్యక్రమాన్ని స్థానిక తానా చార్లెట్ బృందం నాయకులు నాని వడ్లమూడి, కిరణ్ కొత్తపల్లి, టాగూర్ మల్లినేని, మాధురి ఏలూరి, నాగ పంచుమర్తి సమన్వయం చేసి, డా. హిమబిందు గారికి, ఉపాధ్యాయురాలు ఝాన్సీ గారికి ఘనంగా సత్కారం అందించారు. అలాగే, పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ ఈ బృందం శుభాకాంక్షలు తెలియజేసింది. తానా కార్యక్రమాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా ఈ కార్యక్రమం నిలిచింది.
డాన్స్, సంగీతంలో ఉన్నత డిప్లొమా కోర్సులను తీసుకురావడానికి తానా, ఎస్‌పిఎంవివితో భాగస్వామ్యం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది సాంస్కృతిక, విద్యా సంబంధాలను మరింత పటిష్టం చేసింది. స్థానికంగా ఉన్న కళాకారులు తానా కళాశాల ద్వారా తమ కళను మెరుగుపరుచుకునే అవకాశం లభించింది. తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, తానా వైస్ ప్రెసిడెంట్ శ్రీని లావు, తానా కళాశాల నిర్వాహకులు మాలతి నాగభైరవ తదితరులు ఇందులో పాల్గొన్న స్టూడెంట్లకు అభినందనలు తెలియజేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్
అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు
For More AP News And Telugu News