Share News

Pawan Kalyan: సినిమా థియేటర్‌లో గ్రామస్తులతో పవన్ ముఖాముఖీ

ABN , Publish Date - May 22 , 2025 | 12:15 PM

Pawan Kalyan: ప్రజా సమస్యల పరిష్కారానికి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామస్తుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

Pawan Kalyan: సినిమా థియేటర్‌లో గ్రామస్తులతో పవన్ ముఖాముఖీ

అమరావతి, మే 22: ప్రజా సమస్యల పరిష్కారానికి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. వెండి తెర ప్రత్యక్ష ప్రసారం ద్వారా మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి ప్రజలతో ఆయన ముఖా ముఖీ నిర్వహించారు. మన ఊరు - మాటామంతి కార్యక్రమం ద్వారా శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని రావివలస గ్రామస్తులతో ఆయన మాట్లాడారు. వారి సమస్యలను ఆన్ లైన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తుల సమస్యలు వెంటనే పరిష్కరించేలా చూడాలని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. వెండి తెరను.. ప్రజల వేదన తీర్చే సాధనంగా మార్చారంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌‌ను గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు.


రాష్ట్రంలోని ఎక్కడ, ఎప్పుడు ఎవరికి సమస్య ఎదురైనా చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వెంటన స్పందిస్తుంది. అలాగే రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ప్రమాదాలపై సైతం వెంటనే స్పందిస్తూ.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేస్తుంది. ఆ క్రమంలో చిత్తురు, విజయనగరం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతంల్లోని రైతులు ఏనుగుల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను స్థానిక రైతులు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో ఆరు కుంకీ ఏనుగులను ఏపీకి అప్పగించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరారు. అందులోభాగంగా కుంకీ ఏనుగులపై కర్ణాటక ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో బుధవారం నాలుగు కుంకీ ఏనుగులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో అప్పగించిన విషయం విదితమే.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు

టీడీపీ ఎమ్మెల్యేపై ఆరోపణలు.. వైసీపీ నేతపై కేసు నమోదు

జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కీలక ప్రకటన

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 22 , 2025 | 12:46 PM