Andhra Pradesh liquor scam: మిథున్‌రెడ్డికి మరో నోటీసు
ABN , Publish Date - Apr 18 , 2025 | 03:59 AM
మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు కొనసాగుతుండగా, మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డిలను విచారించేందుకు సిట్ సిద్ధమైంది. హాజరుకాకపోతే మరిన్ని చర్యలకు అవకాశముంది.
రేపు రావాలని సిట్ పిలుపు
విచారణకు సాయిరెడ్డి గైర్హాజరు
నేడు వస్తానని సమాచారం
అజ్ఞాతంలోనే రాజ్ కసిరెడ్డి..
సిట్ ముందుకు ఆయన తండ్రి
కొడుకు గురించి ఏమడిగినా తెలియదన్న ఉపేందర్‌రెడ్డి
నేడు మరోసారి విచారణ
ముడుపులిచ్చిన మద్యం వ్యాపారులనూ నేడు, రేపు ప్రశ్నించనున్న అధికారులు
అమరావతి/విజయవాడ, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం దర్యాప్తు వేగాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరింత పెంచింది. కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి (రాజ్ కసిరెడ్డి) కోసం విస్తృతంగా గాలిస్తూనే.. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించేందుకు సిద్ధమైంది. శుక్రవారం (18న) విచారణకు రావాలంటూ వారిద్దరికీ మూడ్రోజుల క్రితం నోటీసులు జారీ చేసింది. అయితే ఒక రోజు ముందే.. గురువారమే వస్తానని చెప్పిన విజయసాయిరెడ్డి కోసం సిట్ చీఫ్ ఎస్వీ రాజశేఖరబాబు, ఇతర అధికారులు విజయవాడ పోలీసు కమిషనర్ కార్యాలయంలో మధ్యాహ్నం వరకూ ఎదురు చూశారు. చివరి నిమిషంలో ఆయన నుంచి ఓ సందేశం వచ్చింది. ఇతరత్రా ముఖ్యమైన పనులు ఉండడం వల్ల రాలేకపోతున్నానని, శుక్రవారం తప్పకుండా హాజరవుతానన్నది దాని సారాంశం. ఇంకోవైపు.. శుక్రవారం రావలసిన మిథున్‌రెడ్డి సిట్ నోటీసుపై హైకోర్టును ఆశ్రయించారు. తన విచారణను ఆడియో-వీడియో రికార్డింగ్ చేయాలని కోరారు. ఇందుకు కోర్టు నిరాకరించడంతో ఆయన సిట్ ముందు హాజరవ్వాల్సిన అనివార్యత ఏర్పడింది.
దీంతో శనివారం (19న) విచారణకు రావాలని సిట్ అధికారులు ఆయనకు మరో నోటీసిచ్చారు. కాగా.. మద్యం కుంభకోణంలో కసిరెడ్డిదే కీలక పాత్ర అని విజయసాయిరెడ్డి గత విచారణ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనను ఏ విచారణకు పిలిపించినా ఇదే విషయాన్ని చెబుతానని నాడు స్పష్టం చేశారు. అయితే ఎన్ని నోటీసులిచ్చినా రాకుండా కసిరెడ్డి పరారీలో ఉండడంతో.. సిట్ బృందం హైదరాబాద్ వెళ్లి ఆయన తండ్రి ఉపేందర్‌రెడ్డికి రెండ్రోజుల కిందట నోటీసిచ్చింది. దీంతో ఆయన గురువారం విజయవాడలో సిట్ కార్యాలయానికి వచ్చారు.

రాజ్ ఎక్కడకు వెళ్తానని ఇంట్లో చెప్పి వెళ్లారు.. ఎక్కడ ఉండే అవకాశం ఉంది.. ఎక్కువగా ఎక్కడకు వెళ్తుంటారరు.. ఎవరితో బాగా దగ్గరగా ఉంటారు.. వంటి ప్రశ్నలను సిట్ అధికారులు సంధించారు. అన్నిటికీ తనకేమీ తెలియదనే ఉపేందర్‌రెడ్డి సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. దరిమిలా శుక్రవారం మరోమారు విచారణకు రావాలని సిట్ అధికారులు సూచించడంతో.. విజయవాడలోనే ఉంటానంటూ తాను బస చేసే హోటల్ వివరాలు చెప్పి వెళ్లినట్లు సమాచారం. ఇంకోవైపు... గత ప్రభుత్వంలో ముడుపులు చెల్లించిన మద్యం వ్యాపారులకు వరుసగా నోటీసులిచ్చిన సిట్.. శుక్ర, శనివారాల్లో పలువురిని ప్రశ్నించనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల
AP Ministers: దెయ్యాలు.. వేదాలు వల్లించినట్లు..
AP High Court: బోరుగడ్డ అనిల్‌కు గట్టి షాక్
Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..
Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత
Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
For AndhraPradesh News And Telugu News