Andhra Pradesh: ఏపీలో పలువురు ఐఏఎస్‌లకు ప్రమోషన్..
ABN , Publish Date - Dec 27 , 2025 | 09:46 PM
ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతి లభించింది. ప్రభుత్వ కార్యదర్శులుగా ప్రమోషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. 2010 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులను సూపర్ టైమ్ స్కేల్ ..
అమరావతి, డిసెంబర్ 27: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతి లభించింది. ప్రభుత్వ కార్యదర్శులుగా ప్రమోషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. 2010 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులను సూపర్ టైమ్ స్కేల్ (పే మ్యాట్రిక్స్ లెవల్–14)కు, క్యాడర్‌కు సమానంగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2026 జనవరి 1 నుండి ఈ ప్రమోషన్స్ అమలులోకి రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యదర్శులుగా పదోన్నతి పొందిన అధికారులలో చదలవాడ నాగరాణి, డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఆమ్రపాలి కటా, జె. నివాస్, గంధం చంద్రుడులు ఉన్నారు.
అయితే, పదోన్నతి పొందిన అనంతరం డాక్టర్ నారాయణ భరత్ గుప్తాను అదే పదవిలో కొనసాగిస్తూ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్, ఆర్‌యూఎస్ఏ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్ట్‌గా కొనసాగించనుంది ప్రభుత్వం. అమ్రపాలి కటా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగించనున్నారు. గంధం చంద్రుడిని కార్మిక శాఖ కమిషనర్‌గా నియమిస్తూ, పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎం.వి. శేషగిరి బాబు రిలీవ్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. చదలవాడ నాగరాణి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్‌గా అదే పదవిలో కొనసాగనున్నారు. అవసరమైన చోట్ల పోస్టుల సృష్టి, అప్‌గ్రేడేషన్, క్యాడర్ సమానత్వానికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేయనుంది. దీనికి సంబంధించి ఉత్తర్వులను వేరుగా జారీ చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ వెల్లడించారు.
Also Read:
మీ ట్యాలెంట్‌కు పరీక్ష.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 19 సెకెన్లలో కనిపెట్టండి
భయపెడుతున్న చలి.. మరో మూడు రోజులు నరకం తప్పదు
హెల్మెట్ గ్లాస్‌పై పొగమంచు పడుతోందా.. ఇతను చేసిన పని చూస్తే నోరెళ్లబెడతారు..