Share News

Cold Wave Update: భయపెడుతున్న చలి.. మరో మూడు రోజులు నరకం తప్పదు

ABN , Publish Date - Dec 27 , 2025 | 09:37 PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. ఉదయం, రాత్రిళ్లు ఎముకలు కొరికే చలి పెడుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యల్పంగా 3 డిగ్రీలు.. మిగిలిన ప్రాంతాల్లో 7 నుంచి 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

Cold Wave Update: భయపెడుతున్న చలి.. మరో మూడు రోజులు నరకం తప్పదు
Cold Wave Update

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి విపరీతంగా ఉంటోంది. ఉదయం, రాత్రిళ్లు బయట తిరగాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంట్లో ఉన్నా కూడా చలి తీవ్రత తగ్గటం లేదు. ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యల్పంగా 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో 7 నుంచి 13 మధ్య ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టులో 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కొమరం భీం ఆసిఫాబాద్‌లో 7.3, ఉమ్మడి మెదక్ 7.9, సంగారెడ్డిలో 7.8 సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.


రానున్న మూడు రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం, ఆదివారం, సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. చలి గాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఏపీలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రెండు, మూడు రోజులు చలి, పొగమంచు కొనసాగుతాయని వెల్లడించారు. మైదాన ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదు అవుతాయని అన్నారు.


చుట్టుముడుతున్న రోగాలు

చలివాతావరణం కారణంగా అంటు వ్యాధులు విజృంభిస్తున్నాయి. చిన్న పిల్లల దగ్గరినుంచి ముసలివాళ్ల వరకు అంటు వ్యాధుల బారినపడుతున్నారు. జులుబు, దగ్గు వంటివి పెచ్చు మీరి విలయతాండవం చేస్తున్నాయి. జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం, రాత్రి వేళల్లో చలిలో తిరగవద్దని వైద్య నిపుణులు జనానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చలి వాతారణం కారణంగా రోగ నిరోధక శక్తి క్షీణించి అంటు వ్యాధులు సులభంగా వస్తాయని అంటున్నారు.


ఇవి కూడా చదవండి

ప్రతి పైసా ప్రజలకు ఖర్చు పెట్టాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశం: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

టీమిండియా జట్టు ప్రకటన.. ఆ మ్యాచులకు కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ!

Updated Date - Dec 27 , 2025 | 09:38 PM