School Ceiling Collapse: నాణ్యత లేని నాడు నేడు పనులు
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:10 AM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ‘నాడు-నేడు’ పనుల నాణ్యతలో డొల్లతనం విద్యార్థులకు శాపంగా మారింది...
పాఠశాల శ్లాబ్ పెచ్చులు పడి నలుగురు విద్యార్థులకు గాయాలు
ఆలూరు రూరల్, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ‘నాడు-నేడు’ పనుల నాణ్యతలో డొల్లతనం విద్యార్థులకు శాపంగా మారింది. పాఠశాల తరగతి గదిలో పైకప్పు పెచ్చులూడిపడి నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలోని 4వ వార్డులో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొంత కాలంగా పాఠశాల పైకప్పు ప్రమాదకరంగా మారింది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం భోజన సమయంలో విద్యార్థులు భోజనం కోసం పాఠశాల ఆరుబయటకు వచ్చారు. ఆ సమయంలో నాలుగో తరగతి గదిలో కూర్చున్న నిత్య, జయశ్రీ, చరణ్, విఘ్నే్‌షలపై పెచ్చులూడి పడటంతో వారి తలలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే వారిని ఉపాధ్యాయులు ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భోజనం సమయంలో మిగిలిన పిల్లలంతా బయట ఉండడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కాగా, పాఠశాలలో గత వైసీపీ ప్రభుత్వంలో నాడు-నేడు పనులు చేపట్టారు. ఆ పనుల్లో నాణ్యత లేమి కారణంగానే ఇలా పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడిపడి విద్యార్థులు గాయపడ్డారని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. నాడు-నేడు పనుల్లో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు విలేకరులకు తెలిపారు.
తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. నువ్వొస్తానంటే.. నే రానిస్తానా..!
పౌరుషానికి ప్రతీక నందమూరి హరికృష్ణ..
Read Latest Andhra Pradesh News and National News