Share News

Ravi Naidu: 'వైసీపీ బకాయిలు పెట్టి.. పోస్టర్లు రిలీజ్ చేయడం సిగ్గుచేటు'

ABN , Publish Date - Feb 01 , 2025 | 12:55 PM

కర్నూలు అవుట్ డోర్ స్టేడియంలోని డీఎస్ఏ కార్యాలయాన్ని శాప్ ఛైర్మన్ రవి నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెట్టిన వైసీపీ నేతలు పోరుబాట పోస్టర్ రిలీజ్ చేయడం సిగ్గుచేటు అన్నారు.

Ravi Naidu: 'వైసీపీ బకాయిలు పెట్టి.. పోస్టర్లు రిలీజ్ చేయడం సిగ్గుచేటు'
Saap Chairman Ravi Naidu

శాప్ ఛైర్మన్ (Saap Chairman) రవి నాయుడు (Ravi Naidu) తాజాగా కర్నూలు అవుట్ డోర్ స్టేడియంలోని డీఎస్ఏ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టారని పేర్కొన్నారు. గతంలో వైసీపీ నేతలు ఫీజు రీయింబర్స్‌కు సంబంధించిన బకాయిలు చెల్లించకుండా, ఇప్పుడు పోరుబాట పోస్టర్లు విడుదల చేయడం సిగ్గుచేటు చర్య అని రవి నాయుడు అన్నారు. వైసీపీ నాయకులు ఈ అంశాన్ని రాజకీయంగా వినియోగించుకుని ప్రజల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.


డీఏస్సీ నోటిఫికేషన్

వైఎస్సార్ పథకం ద్వారా ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని జగన్ తన ప్రభుత్వంలో నీరు గార్చారని రవి నాయుడు అన్నారు. వారి వల్ల అనేక మంది విద్యార్థులు డబ్బులు కట్టలేదని, వారికి సంబంధించిన రెండు లక్షల సర్టిఫికెట్లు ఇంకా కాలేజీల్లోనే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో మార్చిలో డీఏస్సీ నోటిఫికేషన్ జారీ అవుతుందని, విద్యార్థులు వైసీపీ నేతల డైవర్షన్ పాలిటిక్స్ నమ్మోద్దని సూచించారు.


ఆంధ్రప్రదేశ్‌లో స్కాంలపై ఆరోపణలు

ఆడుదాం ఆంధ్రా పేరుతో రూ. 119 కోట్ల స్కాం జరిగిందని పేర్కొన్న రవి నాయుడు, దీనిపై సీబీఐ ఎంక్వైరీ జరపాలని కోరారు. “మాజీ మంత్రి రోజా, మాజీ షాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, చివరికి జగన్ పై కూడా చర్యలు తీసుకోవాలి” అని ఆయన అన్నారు.


ఎన్నారైలు & క్రీడాకారులు

ఈ సందర్భంగా ఎన్నారైలు ఏపీ క్రీడాకారులను దత్తత తీసుకోవాలని రవి నాయుడు అభ్యర్థించారు. మీకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక గౌరవం ఇస్తుందని ఆయన అన్నారు. ఈ క్రమంలో క్రీడాకారుల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో చేస్తున్న పథకాలను వివరించారు. కర్నూలులో రెండు క్రీడా సముదాయాలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. “క్రీడాకారులకు ఒక్కో జిల్లాకు ఒక్కోరకం డ్రెస్ కోడ్‌లతో దుస్తులు, ఖర్చులకు ప్రభుత్వం డబ్బులు ఇస్తోంది. మంత్రి నారా లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని రవి నాయుడు అన్నారు.


ఇవీ చదవండి:

Budget 2025 Latest News: బడ్జెట్‌లో హైలెట్స్..

NTR Bharosa: ఏపీలో వేగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ.. 11 గంటలకే 77.66 శాతం పూర్తి..


Gold Fraud: బ్యాంకులో రూ. 1.70 కోట్ల విలువైన నగల మాయంపై బాధితుల ఆందోళన..


Chandrababu Naidu: నేడు అన్నమయ్యజిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. కారణమిదే..


సచిన్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం.. ఈ అవార్డు చాలా స్పెషల్

ఒకే రోజు ముగ్గురు స్టార్ల సెంచరీలు మిస్.. ఇది ఊహించలేదు

చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు బిగ్ షాక్.. అసలైనోడు దూరం

మరిన్ని తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 01 , 2025 | 12:55 PM