Share News

Police Humility : సెల్యూట్‌ సర్‌!

ABN , Publish Date - Jan 06 , 2025 | 04:17 AM

డబ్బు సంపాదన.. దర్పం.. రాజకీయ సాన్నిత్యం.. కుటుంబ స్వార్థం లాంటివి ఎక్కువగా కనిపిస్తున్న పోలీసు శాఖలో అవేవీ వద్దనే మహానుభావులు చాలా అరుదు!.

 Police Humility : సెల్యూట్‌ సర్‌!

  • రిటైరైన వెంటనే సైకిల్‌పై ఇంటికి.. ఐజీ వెంకట్రామి రెడ్డి సింప్లిసిటీ

  • నిజాయతీ ఊపిరిగా బతికిన పోలీసు అధికారి

అమరావతి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): డబ్బు సంపాదన.. దర్పం.. రాజకీయ సాన్నిత్యం.. కుటుంబ స్వార్థం లాంటివి ఎక్కువగా కనిపిస్తున్న పోలీసు శాఖలో అవేవీ వద్దనే మహానుభావులు చాలా అరుదు!. ఆదాయం వచ్చే పోస్టింగ్‌ కోసం పైరవీలు చేస్తూ లంచాలతో ప్రజల్ని పీడించుకుతినే ఖాకీలున్న చోట.. సమాజ సేవ తప్ప ఇంకేమీ వద్దనే రక్షకభటులూ ఉన్నారంటే ఆశ్చర్యం కలుగకమానదు!. 30 సంవత్సరాల క్రితం డీఎస్పీగా పోలీసు శాఖలో చేరి ఐజీ స్థాయికి ఎదిగిన వెంకట్రామిరెడ్డి అలాంటివారే!. వారం క్రితం పదవీ విరమణ చేశారు. కారు, డ్రైవరు, గన్‌మెన్లు ఉన్నా అవేవీ అక్కర్లేదంటూ అత్యంత సాధారణ జీవితం గడిపేందుకు ఇష్టపడే వెంకట్రామిరెడ్డి సైకిలు తొక్కుకుంటూ రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి నిష్క్రమించారు. ఆయన నవ్వుతూ సంతోషంగా సైకిలు తొక్కుతూ వెళుతుండగా.. ఫోటోలు తీసిన పోలీసులు ‘మీకు సెల్యూట్‌’ సర్‌ అంటూ ఆయన నిరాడంబరతను కొనియాడారు. ఎక్కువకాలం పోలీసులకు శిక్షణ ఇచ్చే పీటీసీల్లో పనిచేసిన వెంకట్రామిరెడ్డి పోలీసుశాఖకు ఎందరో రక్షక భటుల్ని అందించారు. ఆయన రాయలసీమకు చెందినవారు. ఆయన వయసు 61 ఏళ్లు కాగా, తనతో ఉండే తండ్రికి 92 ఏళ్లు. ఇద్దరికీ ఒకటే వ్యసనం.. రోజూ కనీసం 3గంటల పాటు పుస్తకాలు చదవడం!

Updated Date - Jan 06 , 2025 | 04:17 AM