Ramavaram Toll Gate: రామవరం టోల్ గేట్ సిబ్బందిని గుద్దుకుంటూ పోయిన వాహనం
ABN , Publish Date - Sep 26 , 2025 | 04:08 PM
కాకినాడ జిల్లా రామవరం టోల్ గేట్ వద్ద అనూహ్యమైన ఘటన చోటుచేసుకుంది. టోల్ గేట్ దగ్గరకు వచ్చిన ఒక వాహనం సిబ్బందిని గుద్దుకుంటూ ముందుకు దూసుకుపోయింది. ఈ వాహనంలో..
రామవరం(కాకినాడ) సెప్టెంబర్ 26: కాకినాడ జిల్లా రామవరం టోల్ గేట్ వద్ద అనూహ్యమైన ఘటన చోటుచేసుకుంది. టోల్ గేట్ దగ్గరకు వచ్చిన ఒక వాహనం సిబ్బందిని గుద్దుకుంటూ ముందుకు దూసుకుపోయింది. ఈ వాహనంలో గంజాయి తరలిస్తున్నట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఘటన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డయ్యాయి. ఈ వీడియోలో, రాజస్థాన్ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో ఉన్న ఒక తెల్లటి టయోటా వాహనం ముందు 'ఆన్ గవర్నమెంట్ డ్యూటీ' అని రాసి ఉంది. విజయనగరం నుంచి రాజమండ్రి (రాజమహేంద్రవరం) వైపు ఈ వాహనం వెళ్తోంది. పోలీసు యూనిఫారం ఒకటి వాహనంలో ఉంచారు.
అనుమానం వచ్చిన టోల్ గేట్ సిబ్బంది వాహనాన్ని నిలిపి ప్రశ్నించే ప్రయత్నం చేయగా వాహనంలో ఉన్న వాళ్లు టోల్ గేట్ ను గుద్దుకుంటూ బండిని ముందుకు పోనిచ్చారు. ఈ క్రమంలో టోల్ గేట్ సిబ్బందికి గాయాలయ్యాయి. నిందితులు కిర్లంపూడి, పెద్దాపురం, సామర్లకోట, మండపేట మీదుగా పారిపోయినట్టు తెలుస్తోంది.
ఇలా ఉండగా, ఈ వాహనాన్ని రామవరం టోల్ గేట్ వద్ద ఆపడానికి కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రయత్నించినట్టు తెలుస్తోంది. పోలీసులను చూసిన తర్వాత వాహనంలో ఉన్న అనుమానితులు యు-టర్న్ తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించారని ఈ క్రమంలో జగ్గంపేట ఇన్స్పెక్టర్ వాహనం ముందు, వెనుక గ్లాసులను బద్దలు కొట్టినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ EAGLE టీమ్ సదరు వాహనం, అనుమానితులను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ఇవి కూడా చదవండి..
మండలిలో అచ్చెన్న, బొత్స మధ్య మాటల యుద్ధం
Read latest AP News And Telugu News