Payyavula, TG Bharat PC : మంత్రులు పయ్యావుల, టీజీ భరత్ ప్రెస్ మీట్ వివరాలు
ABN , Publish Date - Aug 25 , 2025 | 09:17 PM
'సూపర్ సిక్స్ - సూపర్ హిట్' ప్రోగ్రామ్ అనంతపురంలో ఏర్పాటు చేసుకోబోతున్నామని మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్ చెప్పారు. జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించారు.
అనంతపురం, ఆగస్టు 25 : 'సూపర్ సిక్స్ - సూపర్ హిట్' ప్రోగ్రామ్ అనంతపురంలో ఏర్పాటు చేసుకోబోతున్నామని మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్ చెప్పారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిపై ఇవాళ ఇరువురు మంత్రులు జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించారు. యూరియాపై ప్రతిపక్షాల ఆరోపణలు అబద్ధమని మంత్రి పయ్యావుల అన్నారు.
గతం కంటే ఎక్కువ యూరియా ఇచ్చామని, కేవలం 3 నెలల్లో 35 కోట్లు ఖర్చు పెట్టి HLC పనులు పూర్తి చేయగలిగామని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందన్న పయ్యావుల, మరింత బాధ్యతగా వ్యవహరించడం ద్వారా ప్రజల మన్ననలు పొందాలని అధికారులకు సూచించారు. 'స్త్రీ శక్తి ఉచిత బస్సు గ్రాండ్ సక్సెస్ అయింది. సూపర్ సిక్స్ - సూపర్ హిట్ ప్రోగ్రామ్ అనంతపురంలో ఏర్పాటు చేసుకోబోతున్నాం.' అని పయ్యావుల తెలిపారు.
ఇంచార్జ్ మంత్రి టీ జీ భరత్ మీడియాతో మాట్లాడుతూ.. 'పరిశ్రమలు రాష్ట్రమంతా రాబోతున్నాయి. సత్యసాయి జిల్లాకు ఎక్కువగా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బెంగుళూరు సరిహద్దుగా ఉండడం సత్యసాయి జిల్లాకు కలిసివచ్చింది. కేంద్ర ప్రభుత్వం GSTలో సామాన్యుడికి న్యాయం జరిగేలా రిఫార్మ్స్ తీసుకురాబోతున్నారు. దీనికి మేము సంపూర్ణంగా సహకరిస్తాం. రాష్ట్రంపై ఆర్థిక భారం పడినా సరే దీనికి మేము పూర్తిగా సహకరిస్తాం. ఈ రిఫార్మ్స్ వల్ల రాష్ట్రాలకు ఆర్థిక భారం ఉండే అవకాశం ఉంది. గత పాలకులు చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నాం.. అందుకే అప్పులు చేస్తున్నాం. పోలవరాన్ని, అమరావతిని , ఇరిగేషన్ ప్రాజెక్టులు, నేషనల్ హైవే లు , మెట్రో లు ఇలా అనేకం చేయబోతున్నాం. పెన్షన్ లపై చాలా క్లియర్ గా చెప్పాం. కేవలం నోటీసులు మాత్రమే ఇస్తాం... ఆ నోటీసులను మెడికల్ బోర్డు తో ప్రూవ్ చేసుకోవాలి. యూరియా ఎక్కడైనా అక్రమ రవాణా జరిగితే వెంటనే విజిలెన్స్ అధికారులకి సమాచారం ఇవ్వాలి.' అని టీజీ భరత్ చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్‌ను నేను అనలేదు అని MLA చెప్పిన తర్వాత ఇంకా వివాదం చేయడం భావ్యం కాదని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా భరత్ క్లారిటీ ఇచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి..
నారా లోకేష్.. స్మార్ట్‌గా ఆలోచిస్తున్నారు : పల్లా శ్రీనివాసరావు
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్
For More AP News And Telugu News