Kurnool: పీటీ వారెంట్‌పై కర్నూలుకు పోసాని
ABN , Publish Date - Mar 05 , 2025 | 02:36 AM
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లపై అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని

ఆదోనిలో గత నవంబరు 14న కేసు నమోదు
జనసేన పట్టణ అధ్యక్షుడు రేణువర్మ ఫిర్యాదు
గుంటూరు జిల్లా జైలు నుంచి తరలింపు
కర్నూలు/అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లపై అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని కర్నూలు జిల్లా ఆదోని త్రీటౌన్ పోలీసులు పీటీ వారెంట్‌పై గుంటూరు జిల్లా జైలు నుంచి మంగళవారం కర్నూలుకు తరలించారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకుడుగా పోసాని జుగుప్సాకర వ్యాఖ్యలు చేశారు. దీంతో జనసేన పార్టీ కర్నూలు జిల్లా ఆదోని పట్టణ అధ్యక్షుడు మలిశెట్టి రేణువర్మ గత ఏడాది నవంబరు 14న త్రీటౌన్ పోలీ్‌సస్టేషన్ ఫిర్యాదు చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గురించి జగన్ మీడియాలో అసభ్యకరంగా దూషించారని, కృష్ణమురళి మాట్లాడిన మాటలకు కొన్ని వర్గాల్లో విద్వేషాలు రగిలి శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా జైల్లో ఉన్న పోసానిని పీటీ వారెంట్‌పై ఆదోని త్రీటౌన్ సీఐ రామలింగమయ్య ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడ నుంచి తీసుకువచ్చారు. అనంతరం.. ఆదోని ఏజేఎ్‌ఫసీఎం కోర్టు ఇన్‌చార్జి న్యాయాధికారి అపర్ణ నివాసం వద్ద అర్ధరాత్రి సమయంలో హాజరుపరిచారు.
నాపై కేసులు కొట్టివేయండి.. హైకోర్టుకు పోసాని
‘‘సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా వారి కుటుంబ సభ్యులు, మీడియా సంస్థలు, కమ్మ సామాజికవర్గాన్ని దూషించానంటూ రాష్ట్రంలోని 4 పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన కేసులను కొట్టివేయండి.’’ అని అభ్యర్థిస్తూ సినీ నటుడు పోసాని కృష్ణమురళి మంగళవారం హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. సంబంధిత పోలీస్ స్టేషన్లలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా తదుపరి చర్యలను నిలువరించాలని అభ్యర్థించారు. ‘‘పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు నాకు వర్తించవు. నా వ్యాఖ్యలతో సమాజ శాంతికి భంగం కలగనందున బీఎన్‌ఎస్ సెక్షన్ 353(2) వర్తించదు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు ఏడేళ్లలోపు శిక్షకు వీలున్నవే. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని నాపై నమోదు చేసిన కేసులను కొట్టివేయండి.’’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.