Share News

Tirumala : ఆ కాంట్రాక్ట్‌ ఉద్యోగి చేతివాటం రూ.46లక్షలు!

ABN , Publish Date - Jan 14 , 2025 | 03:21 AM

తిరుమల పరకామణి దొంగతనం కేసులో కొత్త విషయాలు వెలుగుచూశాయి.

Tirumala : ఆ కాంట్రాక్ట్‌ ఉద్యోగి  చేతివాటం రూ.46లక్షలు!

  • బంగారు, వెండి వస్తువులు

  • స్వాధీనం చేసుకున్న పోలీసులు

తిరుమల, జనవరి13(ఆంధ్రజ్యోతి): తిరుమల పరకామణి దొంగతనం కేసులో కొత్త విషయాలు వెలుగుచూశాయి. వంద గ్రాముల గోల్డ్‌ బిస్కెట్‌ దొంగతనం చేసేందుకు ప్రయత్నించి పట్టుబడిన అబ్రిపోస్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగి వీరిశెట్టి పెంచలయ్య నుంచి దాదాపు రూ.46 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెంచలయ్య శనివారం మఽధ్యా హ్నం ఖాళీ ట్రాలీ పైపు ద్వారా వంద గ్రాముల బంగా రు బిస్కెట్‌ను తస్కరించే ప్రయత్నం చేయగా విజిలెన్స్‌ అధికారులు గుర్తించి పట్టుకున్న విషయం తెలిసిందే. అతడిపై శనివారమే కేసు నమోదు చేయగా, ఆదివారం విషయం వెలుగులోకి వచ్చింది. పెంచలయ్యను తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు తమదైన శైలిలో విచారించి, అతడి నుంచి 655 గ్రాముల బరువు కలిగిన బంగారు బిస్కెట్‌, ఆభరణాలతో పాటు మరో 157 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.46 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా, పెంచలయ్య రెండేళ్లుగా పరకామణిలో విధులు నిర్వహిస్తున్నాడు. అతని తీరు అనుమానాస్పదంగా ఉండటంతో ప్రత్యేక నిఘా ఉంచిన విజిలెన్స్‌ అధికారులు శనివారం నేరుగా పట్టుకున్నారు.

Updated Date - Jan 14 , 2025 | 03:21 AM