Share News

AP Police: వంశీని మరో 10 రోజుల కస్టడీకి ఇవ్వండి

ABN , Publish Date - Mar 06 , 2025 | 04:19 AM

ముదునూరి సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితుడు వల్లభనేని వంశీమోహన్‌ను మరో పది రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును అభ్యర్థించారు.

AP Police: వంశీని మరో 10 రోజుల కస్టడీకి ఇవ్వండి

  • మూడు రోజుల కస్టడీలో విచారణకు సహకరించలేదు

  • వంశీ నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉంది

  • బెజవాడ కోర్టులో పోలీసుల పిటిషన్‌

విజయవాడ, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ముదునూరి సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితుడు వల్లభనేని వంశీమోహన్‌ను మరో పది రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు విజయవాడ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ కోర్టులో బుధవారం పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇంతకు ముందు తాము పది రోజుల కస్టడీకి కోరితే మూడు రోజులే అనుమతించారని, ఆ మూడు రోజుల్లో వంశీ విచారణకు సహకరించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దర్యాప్తు అధికారులు అడిగిన ప్రశ్నలకు సరిగా సమాధానాలు చెప్పలేదని, కొన్ని ప్రశ్నలకు విచారణను తప్పుదోవ పట్టించేలా జవాబులు ఇచ్చారని వివరించారు. ఈ కేసులో ఇంకా కొంతమంది కీలకమైన వ్యక్తులను అరెస్టు చేయాల్సి ఉందని, మరికొన్ని వివరాలను రాబట్టాల్సి ఉందని పేర్కొన్నారు.

  • సీసీ ఫుటేజ్‌ భద్రపరిచేలా పోలీసులను ఆదేశించండి

  • హైకోర్టును ఆశ్రయించిన వంశీ భార్య... విచారణ వాయిదా

తన భర్త అరెస్టు అక్రమమని నిరూపించేందుకు ఆధారమైన విజయవాడ పటమట పోలీస్ స్టేషన్‌ సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వైసీపీ నేత వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. గతనెల 10 నుంచి 15వ తేదీ వరకు పోలీసుస్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సహాయ ప్రభుత్వ న్యాయవాది బసవేశ్వరరావు స్పందిస్తూ... వ్యాజ్యం మొదటిసారి విచారణకు వచ్చిందని, వివరాలు సమర్పించేందుకు గడువు కావాలని, విచారణను సోమవారానికి వాయిదా వేయాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌ విచారణను 10వ తేదీకి వాయిదా వేశా

Updated Date - Mar 06 , 2025 | 04:20 AM