Share News

PM Modi : హిమాలయాలకు వెళ్తున్నారా?

ABN , Publish Date - Feb 21 , 2025 | 03:27 AM

ఏం.. హిమాలయాలకు వెళ్తున్నారా’ అని చమత్కరించారు. అదేం లేదని పవన్‌ నవ్వుతూ చెప్పారు. దానికంటే ముందు నెరవేర్చాల్సిన బాధ్యతలున్నాయని బదులిచ్చారు.

PM Modi : హిమాలయాలకు వెళ్తున్నారా?

  • పవన్‌తో మోదీ చమత్కారం

  • ఢిల్లీలో అసాధారణ విజయంపై

  • మోదీకి చంద్రబాబు అభినందనలు

  • రాత్రికి ఢిల్లీలోనే ఉండిపోవాలని

  • కోరిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

  • మళ్లీ వస్తానని చెప్పిన సీఎం

ABN AndhraJyothy: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను కాషాయ వస్త్రాలతో చూసిన ప్రధాని మోదీ.. ‘ఏం.. హిమాలయాలకు వెళ్తున్నారా’ అని చమత్కరించారు. అదేం లేదని పవన్‌ నవ్వుతూ చెప్పారు. దానికంటే ముందు నెరవేర్చాల్సిన బాధ్యతలున్నాయని బదులిచ్చారు. మోదీతో తన సంభాషణ గురించి పవన్‌ విలేకరులకు చెప్పారు. ఆయన నాయకత్వంలో ఎన్డీఏ దేశమంతా విస్తరిస్తోందని, ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకోవడం చరిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. ఎన్డీఏపై ప్రజల విశ్వాసం పెరుగుతోందనడానికి ఇది నిదర్శనమని తెలిపారు. ఢిల్లీ ఓటర్లకు చేరువయ్యేందుకు భారీఎత్తున సూక్ష్మప్రణాళికతో కూడిన ప్రచారాన్ని బీజేపీ నిర్వహించిన సంగతి తెలిసిందే. పలు ప్రాంతాల్లో చంద్రబాబు సహా ఎన్డీఏ నేతలను, ఎంపీలను ప్రచారానికి తీసుకొచ్చింది.

Updated Date - Feb 21 , 2025 | 03:27 AM