Share News

DHARNA : శాశ్వత ఉద్యోగ నియామకాలు చేపట్టాలి

ABN , Publish Date - Feb 22 , 2025 | 12:44 AM

దేశ వ్యాప్తంగా అన్ని జాతీయ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి శాశ్వత ఉద్యోగా ల నియామకాలు చేపట్టాలని యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంకు యూని యన్స నాయకులు డిమాండ్‌ చేశారు. మార్చి 24, 25వ తేదీల్లో చేపట్టే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం సాయంత్రం స్థానిక సాయి నగర్‌ లోని స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఎదుట ధర్నా నిర్వహించారు.

DHARNA : శాశ్వత ఉద్యోగ నియామకాలు చేపట్టాలి
Bank employees protesting in front of Sainagar SBI

మార్చి 3న పార్లమెంట్‌ ఎదుట ధర్నా, 24, 25 తేదీల్లో సమ్మె

యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స నాయకులు

అనంతపురం క్లాక్‌టవర్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి) : దేశ వ్యాప్తంగా అన్ని జాతీయ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి శాశ్వత ఉద్యోగా ల నియామకాలు చేపట్టాలని యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంకు యూని యన్స నాయకులు డిమాండ్‌ చేశారు. మార్చి 24, 25వ తేదీల్లో చేపట్టే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం సాయంత్రం స్థానిక సాయి నగర్‌ లోని స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ... దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల్లో ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని రద్దు చేసి, శాశ్వత ఉద్యోగాల నియామకాలు చేపట్టాలన్నారు. సమస్యలపై మార్చి 3వ తేదీన ఢిల్లీలోని పార్లమెంట్‌ ఎదుట ధర్నా, అలాగే దేశ వ్యాప్తంగా సు మారు 10లక్షల మంది భాగస్వామ్యంతో మార్చి 24, 25వ తేదీల్లో చేపట్టే సమ్మెను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు ఖాదర్‌బాషా, చంద్ర మోహన, నరేంద్ర, రాఘురామ్‌ యాదవ్‌, చంద్రశేఖర్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక కమలానగర్‌లోని బ్యాంకు ఆఫ్‌ బరోడా వద్ద అనంతపూర్‌ జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్ర మం నిర్వహించారు. బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ జిల్లా కార్య దర్శి సంజయ్‌రామ్‌ మాట్లాడారు. ఆ సంఘం నాయకులు భరత, సునీత, అరవింద్‌, శ్రీకాంత, చంద్రమౌళి, మురళి, శ్వేత తదితరులు పాల్గొన్నారు. స్థానిక టవర్‌క్లాక్‌ సమీపంలో ఉన్న కెనరాబ్యాంకు ఎదుట ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కెనరాబ్యాంకు వర్క్‌మెన ఎంప్లాయీస్‌ యూనియన డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ మున్వర్‌బాషా మాట్లాడారు. ఆ సంఘం నాయకులు రమణరాజు, హరీష్‌, బయన్న, మునిగోపాల్‌, నంజుండస్వామి, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Feb 22 , 2025 | 12:48 AM