Pension Restoration: అమరావతిలో భూమిలేని పేదలకు పింఛన్ల పునరుద్ధరణ
ABN , Publish Date - Jul 14 , 2025 | 03:27 AM
అమరావతి రాజధానిలో భూమిలేని 1575 మంది పేదలకు పింఛన్లను పునరుద్ధరిస్తూ..
1575 మందికి మళ్లీ పింఛన్లు
అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధానిలో భూమిలేని 1575 మంది పేదలకు పింఛన్లను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. సీఆర్‌డీఏ పరిధిలో నివశిస్తున్న భూమిలేని పేదలకు గతంలో టీడీపీ ప్రభుత్వం పెన్షన్లు మంజూరుచేసిం ది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరంచెల తనిఖీలు చేపట్టి వారిలో 1575 మంది అర్హులు కారని తేల్చి పెన్షన్ రద్దు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 40వ సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో వారందరికీ పెన్షన్లు పునరుద్ధరించాలని నిర్ణయించింది. అమరావతి రాజధాని తర్వాత పలువురు ఉపాధి కోల్పోయినందున పెన్షన్లు పునరుద్ధరించాలని నిర్ణయించడంతో ఆ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.